Uttam Kumar: భారాస మేడిగడ్డ పర్యటనకు కేసీఆర్‌ సైతం వెళ్లాలి: మంత్రి ఉత్తమ్‌

భారాస నేతల మేడిగడ్డ బ్యారేజీ పర్యటనను స్వాగతిస్తున్నామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు.

Updated : 28 Feb 2024 20:19 IST

హైదరాబాద్‌: భారాస నేతల మేడిగడ్డ బ్యారేజీ పర్యటనను స్వాగతిస్తున్నామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. ఇంత భారీగా అవినీతి చేసి కూడా మేడిగడ్డకు వెళ్తామంటున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ జలసౌధలో ఆయన మాట్లాడారు. ‘‘భారాస నేతల మేడిగడ్డ పర్యటనకు సహకరించాలని అధికారులను ఆదేశించాం. వారి తీరు ‘ఉల్టా చోర్‌..’ సామెతను గుర్తు చేస్తోంది. భారాస మేడిగడ్డ పర్యటనకు కేసీఆర్‌ సైతం వెళ్లాలి. కుంగిన ఆనకట్ట సాక్షిగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టవద్దని నిపుణుల కమిటీ సూచించింది. కాళేశ్వరం రూపంలో రాష్ట్రంపై మోయలేని భారం మోపారు. స్వతంత్ర భారతంలో ఇంత భారీ అవినీతి గతంలో ఎన్నడూ జరగలేదు. ప్రాజెక్టుల విషయంలో భారాస సర్కారు అవినీతిని కాగ్‌ ఎండగట్టింది. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ కూడా వివరించింది’’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని