CPI Ramakrishna: జగన్, అదానీల రహస్య భేటీ వెనుక మర్మమేంటి?: సీపీఐ రామకృష్ణ

అదానీతో జరిగిన భేటీ వివరాలను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి వెల్లడించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ‘‘అది వ్యక్తిగత భేటీనా? లేక వ్యవస్థీకృత భేటీనా?

Updated : 29 Sep 2023 18:50 IST

భవానీపురం(విజయవాడ): అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీతో జరిగిన భేటీ వివరాలను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి వెల్లడించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ‘‘అది వ్యక్తిగత భేటీనా? లేక వ్యవస్థీకృత భేటీనా? గతంలో కూడా ఆహ్వాన పత్రిక ఇచ్చే పేరుతో అదానీ జగన్‌తో 4 గంటలపాటు భేటీ అయ్యారు. ఏపీలో ఇప్పటికే గంగవరం, కృష్ణపట్నం పోర్టులను, సోలార్ విద్యుత్ ఒప్పందాలను అదానీ కంపెనీకే అప్పగించారు. ఏపీలో స్మార్ట్ మీటర్ల ఏర్పాట్లు కూడా అత్యంత భారీ ధరకు అదానీకే కట్టబెట్టారు. జగన్, అదానీల రహస్య భేటీ వెనుక మర్మమేంటి?’’ అని రామకృష్ణ ప్రశ్నించారు. 

జగన్‌ హామీ... ఏమాయె సామీ!

గురువారం రాత్రి తాడేపల్లిలోని సీఎం నివాసంలో జగన్‌తో గౌతమ్‌ అదానీ భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై ఆయన జగన్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. భేటీ వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ) వెల్లడించలేదు. అదానీ రాక, సీఎంతో భేటీ అంతటినీ రహస్యంగా ఉంచింది. సాధారణంగా ఎవరైనా ముఖ్యులు సీఎంతో భేటీ అయినప్పుడు ఆ వివరాలను మీడియాకు వెల్లడించే సీఎంఓ, ఇప్పుడు సమాచారాన్ని బయటకు పొక్కనివ్వలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని