Palnadu: త్వరలో తెదేపాలో చేరుతున్నా: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు

నరసరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజలకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లేఖ రాశారు.

Updated : 26 Feb 2024 12:54 IST

అమరావతి : నరసరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజలకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లేఖ రాశారు.  ఐదేళ్లుగా తనపై చూపిన ప్రేమ, అభిమానం మరవలేనని ఆయన పేర్కొన్నారు. ‘‘పల్నాడు జిల్లా అభివృద్ధి కోసం మళ్లీ పోటీ చేయబోతున్నా. త్వరలో తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరబోతున్నా. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా మళ్లీ మీ ముందుకొస్తున్నా. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పల్నాడు అభివృద్ధికి కృషి చేశా. మరోసారి అవకాశం ఇస్తే అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తా’’ అని లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని