YS Sharmila: జగన్‌ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్‌ షర్మిల

రాష్ట్ర మంతా వైకాపా మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు.

Updated : 19 Apr 2024 16:52 IST

ఆలూరు: రాష్ట్ర మంతా వైకాపా మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఎక్కడ చూసినా మద్యం మాఫియా, మట్టి మాఫియా, ఇసుక మాఫియా చెలరేగిపోతోందన్నారు. 

‘‘వేదవతి ప్రాజెక్టును పూర్తి చేస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. ఐదేళ్లలో ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదు. 2008లో వైఎస్‌ఆర్‌ శిలాఫలకం వేస్తే.. అదే ప్రాజెక్టుకు జగన్‌ మరో శిలాఫలకం వేశారు. ఈ ప్రభుత్వం శిలాఫలకాల ప్రభుత్వం. ప్రాజెక్టు కట్టి ఉంటే 80వేల ఎకరాలకు సాగునీరు వచ్చి ఉండేది. రైతుల కోసం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ అన్నారు.. కట్టలేదు. ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి మోసం చేశారు. రైతును వైఎస్‌ఆర్‌ రాజును చేస్తే.. వైకాపా హయాంలో రైతు అప్పుల పాలయ్యారు. మూర్ఖులకు, అహంకారులకు ఓటు వేయొద్దు. మీ ఓటు వృథా కానివ్వొద్దు.. వైకాపాకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం.. హోదా ఇచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే. అధికారమిస్తే 2.25లక్షల ఉద్యోగాలు ఇస్తాం’’ అని షర్మిల హామీ ఇచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని