TDP: చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు

భీమిలి, జీడీ నెల్లూరు నియోజకవర్గాలకు చెందిన పలువురు వైకాపా నేతలు తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో గురువారం ఆ పార్టీలో చేరారు.

Updated : 18 Apr 2024 17:43 IST

అమరావతి: భీమిలి, జీడీ నెల్లూరు నియోజకవర్గాలకు చెందిన పలువురు వైకాపా నేతలు తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో గురువారం ఆ పార్టీలో చేరారు. వీఎంఆర్‌డీఏ మాజీ ఛైర్‌పర్సన్‌ అక్కరమాని విజయనిర్మలతో పాటు దుక్క కృష్ణయాదవ్‌, వైకాపా జిల్లా ప్రధానకార్యదర్శి ఒమ్మి దేవుడు, పద్మనాభం మాజీ ఎంపీపీ గోపిరాజు, మాజీ సర్పంచ్‌లు గేదెల చంద్రారావు, నమ్మి వెంకట్రావు, భీమిలి 25వ వార్డు అధ్యక్షుడు జి.సూర్యబాబు తెదేపాలో చేరారు. జీడీ నెల్లూరు నుంచి సింగిల్‌ విండో మాజీ అధ్యక్షుడు బాబు నాయుడు, మాజీ సర్పంచి జయచంద్రనాయుడు చేరారు. వీరికి చంద్రబాబు.. తెదేపా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని