YSRCP: వార్‌ వన్‌ సైడ్‌.. వైకాపాకు దక్కని ప్రతిపక్ష హోదా

గత ఐదేళ్లు ఏపీలో సాగించిన అరాచక పాలనతో వైకాపా (YSRCP) మూల్యం చెల్లించుకుంది. ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ ఘోర పరాభవం చవిచూసింది.

Updated : 04 Jun 2024 18:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లు సాగించిన అరాచక పాలనకు వైకాపా (YSRCP) మూల్యం చెల్లించుకుంది. ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ దారుణ ఓటమి మూటగట్టుకుంది. కౌంటింగ్‌ ప్రారంభం నుంచి ఏ దశలోనూ తెదేపా నేతృత్వంలోని కూటమికి కనీస స్థాయి పోటీ ఇవ్వలేకపోయింది. చివరకు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవడం గమనార్హం. ఆ హోదా రావాలంటే 18 మంది ఎమ్మెల్యేలు గెలుపొందాలి. కానీ వైకాపా మాత్రం.. 8-10 సీట్లకే పరిమితమైంది.

‘వార్‌ వన్‌ సైడ్‌’ అన్నట్లుగా కూటమి దుమ్ములేపింది. జగన్‌ నియంతృత్వ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడుతూ.. కూటమికి ఘన విజయం కట్టబెట్టారు. ఇప్పటికే 117 స్థానాల్లో విజయం సాధించిన కూటమి అభ్యర్థులు.. మరో 17 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. వైకాపా కంటే మెరుగ్గా జనసేన సొంతంగానే 21 స్థానాల్లో గెలుపొందింది. మొదటినుంచి ఫలితాల సరళి చూసి వైకాపాకు ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందా? అని రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక్తం కాగా.. చివరకు అదే నిజమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని