YSRCP: ఎమ్మెల్యే వస్తే లేచి నిలబడరా?.. బీసీలపై వైకాపా దౌర్జన్యం

ఏలూరు జిల్లా దెందులూరు మండలం తిమ్మన్నగూడెంలో బీసీ వర్గానికి చెందిన యువకులపై వైకాపా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి దౌర్జన్యానికి పాల్పడ్డారు.

Published : 20 Mar 2024 15:28 IST

దెందులూరు: ఏలూరు జిల్లా దెందులూరు మండలం తిమ్మన్నగూడెంలో బీసీ వర్గానికి చెందిన యువకులపై వైకాపా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి దౌర్జన్యానికి పాల్పడ్డారు. అనుచరులతో కలిసి గత రాత్రి ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వాహనంపై వెళ్తూ గ్రామంలో బెంచీలపై కూర్చున్న యువకులను చూసి చేయి ఊపారు. యువకులు కూడా ఎమ్మెల్యేకు అభివాదం చేశారు. లేచి నిల్చోకుండా కూర్చొని చెయ్యి ఊపారంటూ.. ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనాలు ఆపి ఎమ్మెల్యే సహా దాదాపు  20మంది దాడికి దిగారు. ఈ ఘటనలో దుర్గాప్రసాద్‌కు గాయాలవ్వగా ఏలూరు ఆసుపత్రికి తరలించారు. దాడిని వీడియో తీస్తున్న మరో యువకుడి ఫోన్‌ లాక్కుని ధ్వంసం చేశారు.  కేవలం కూర్చొని చెయ్యి ఊపినందుకే తమపై దాడి చేశారని గాయపడ్డ యువకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు