Varaprasad: భాజపాలో చేరిన గూడూరు వైకాపా ఎమ్మెల్యే

వైకాపాకు మరో షాక్‌ తగిలింది. తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌ భాజపాలో చేరారు.

Updated : 24 Mar 2024 13:48 IST

దిల్లీ: వైకాపాకు మరో షాక్‌ తగిలింది. తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌ భాజపాలో చేరారు. దిల్లీలో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్‌ థావడే సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకొన్నారు. ఈ ఎన్నికల్లో వరప్రసాద్‌కు వైకాపా టికెట్‌ నిరాకరించింది. ఆయన స్థానంలో మేరిగ మురళీధర్‌కు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో వరప్రసాద్‌ భాజపాలో చేరారు. 2014 ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి ఆయన విజయం సాధించారు. 2019లో గూడూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

భాజపాలో చేరిన అనంతరం వరప్రసాద్‌ మాట్లాడారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం ప్రధాని నరేంద్రమోదీకే సాధ్యమన్నారు. ఆయన సారథ్యంలో పనిచేయడం సంతోషంగా ఉందని చెప్పారు. మరోసారి తిరుపతి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి వరప్రసాద్‌ పోటీ చేసే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని