Chandrababu: వైకాపాకు 35 సీట్లు కూడా రావు

రాష్ట్రంలో రాబోయేది ఎన్డీయే ప్రభుత్వమేనని తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

Published : 30 May 2024 05:06 IST

చంద్రబాబుతో మాట్లాడుతున్న తెదేపా నేతలు బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, రఘురామకృష్ణరాజు, కొల్లు రవీంద్ర, కళావెంకటరావు

ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో రాబోయేది ఎన్డీయే ప్రభుత్వమేనని తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్‌ రోజు, అనంతరం వైకాపా శ్రేణులు సృష్టించిన హింసాకాండను దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్‌ రోజు మరింత అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు ఆయన సూచించారు. విదేశీ పర్యటనను ముగించుకొని వచ్చిన చంద్రబాబును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పలువురు తెదేపా నేతలు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చోటుచేసుకొన్న పరిణామాలను వారు అధినేత దృష్టికి తీసుకెళ్లారు. వైకాపా కుట్రల్ని ఎదుర్కొంటూ ఈసీని, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని చంద్రబాబు వారికి సూచించారు. వైకాపాకు 35 సీట్లు రావడం కూడా కష్టమేనని ఆయన అన్నట్టు నేతలు తెలిపారు. చంద్రబాబును కలిసిన వారిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కళా వెంకటరావు, కొల్లు రవీంద్ర, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, కేశినేని చిన్ని, వెనిగండ్ల రాము, రఘురామకృష్ణరాజు, భాష్యం ప్రవీణ్, వర్మ తదితరులు ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని