Yuvagalam: లోకేశ్‌ ‘యువగళం’ పైలాన్‌ ఆవిష్కరణ.. హాజరైన బ్రాహ్మణి, మోక్షజ్ఞ

‘యువగళం’ (Yuvagalam) పాదయాత్ర 3వేల కి.మీ మైలురాయిని పూర్తిచేసుకున్న సందర్భంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) పైలాన్‌ను ఆవిష్కరించారు.

Updated : 11 Dec 2023 13:06 IST

తుని: ‘యువగళం’ (Yuvagalam) పాదయాత్ర 3వేల కి.మీ మైలురాయిని పూర్తిచేసుకున్న సందర్భంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) పైలాన్‌ను ఆవిష్కరించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం రాజుల కొత్తూరు వద్ద పైలాన్‌ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లోకేశ్ సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌, నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్‌, బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ హాజరయ్యారు. పెద్ద ఎత్తున తెదేపా నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం లోకేశ్‌తో పాటు బ్రాహ్మణి, దేవాన్ష్‌, మోక్షజ్ఞ పాదయాత్రలో పాల్గొన్నారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. 

జనవరి 27న కుప్పంలో ప్రారంభమైన ‘యువగళం’ పాదయాత్రకు.. ప్రభుత్వం, వైకాపా నాయకుల నుంచి అవరోధాలు ఎదురైనా లోకేశ్‌ ప్రజాగళం వినిపిస్తూ ముందుకు సాగారు. పది ఉమ్మడి జిల్లాల్లో 92 నియోజకవర్గాల మీదుగా సాగిన యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మలికిపురం మండలం దిండి వద్ద సెప్టెంబరు 8న యాత్ర ప్రవేశించింది. మర్నాడు చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పాదయాత్ర 79 రోజులపాటు ఆగింది. గత నెల 26న యాత్ర పునఃప్రారంభించారు. అన్నివర్గాలూ పాదయాత్రకు నీరాజనం పలికాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని