Nara Lokesh: నారా లోకేశ్‌కు జెడ్‌ కేటగిరీ భద్రత

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జెడ్‌ కేటగిరీ భద్రత కల్పించింది.

Updated : 30 Mar 2024 22:53 IST

అమరావతి: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జెడ్‌ కేటగిరీ భద్రత కల్పించింది. సీఆర్‌పీఎఫ్‌ (వీఐపీ వింగ్‌) బలగాలతో భద్రత కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అక్టోబర్ 2016 ఏవోబీ ఎన్‌కౌంటర్‌ తరువాత లోకేశ్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని నాటి సెక్యూరిటీ రివ్యూ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనకు భద్రతను తగ్గించింది. సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సులను పక్కన పెట్టి వై కేటగిరీ మాత్రమే కల్పిస్తూ వచ్చింది.

ఈ క్రమంలో తగిన భద్రత కల్పించాలంటూ 14 సార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్‌కు లోకేశ్‌ భద్రతా సిబ్బంది లేఖలు రాశారు. భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని అనేక సార్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. యువగళం పాదయాత్రలో లోకేశ్‌ లక్ష్యంగా అనేక సార్లు జరిగిన వైకాపా ప్రేరేపిత దాడులను వివరించారు. గతంలో మావోయిస్టు హెచ్చరికలు, భద్రతా పరంగా ఉన్న నిఘా వర్గాల సమాచారాన్ని కూడా పరిశీలించిన కేంద్రం.. తాజాగా జెడ్‌ కేటగిరీ భద్రత కల్పించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు