Zaheerabad MP: భారాసకు రాజీనామా చేసి భాజపాలో చేరిన జహీరాబాద్‌ ఎంపీ

జహీరాబాద్‌ భారాస ఎంపీ బీబీ పాటిల్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు

Published : 01 Mar 2024 16:28 IST

హైదరాబాద్‌: జహీరాబాద్‌ భారాస ఎంపీ బీబీ పాటిల్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం దిల్లీలోని భాజపా కార్యాలయంలో తరుణ్‌ చుగ్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌తో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. 2014, 2019 ఎన్నికల్లో భారాస తరఫున జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పాటిల్‌ ఎంపీగా ఎన్నికయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని