MS Dhoni: ఆ విషయంలో ధోనీ అందరి అంచనాలను తల్లకిందులు చేశాడు: డివిలియర్స్‌

మిస్టర్‌ కూల్‌ కెప్టెన్‌ ధోనీ (MS Dhoni)పై దక్షిణాఫ్రికా మిస్టర్‌ 360 ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మరో మూడు సీజన్లు ఆడే సత్తా ధోనీకి ఉందని అంచనావేశాడు. 

Published : 30 Nov 2023 18:45 IST

ఇంటర్నెట్‌డెస్క్: కెప్టెన్‌ కూల్‌ ధోనీ (MS Dhoni) ఐపీఎల్‌ భవిష్యత్తుపై మిస్టర్‌ 360 ఏబీ డివిలియర్స్‌ (Ab de Villiers ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహీ ఐపీఎల్‌ జైత్రయాత్ర అంచనాలకు మించి సాగుతోందన్నాడు. తాజాగా తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ..‘‘చెన్నై కొనసాగించిన ఆటగాళ్ల జాబితాలో ధోనీ పేరును చూసి సంతోషించాను. గత సీజనే ధోనీకి చివరిదయ్యే అవకాశం ఉందని భారీగా ప్రచారం జరిగింది. అతడు 2024 ఐపీఎల్‌ సీజన్‌ ఆడేందుకు సిద్ధమయ్యాడు. అతడు ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంటాడు. ఎవరికి తెలుసు..? అతడు మరో మూడు సీజన్ల కంటే ఎక్కువ ఆడతాడమేమో. ఆ సీజన్లలో అతడి పేరు చూడాలన్నది ఆకాంక్ష మాత్రమే’’ అని డివిలియర్స్‌  పేర్కొన్నాడు.

‘టీ20 ప్రపంచకప్‌ ఉన్న ఈ తరుణంలో’.. కోచ్‌గా ద్రవిడ్‌ కొనసాగింపుపై గంభీర్‌ స్పందన

ఇక పంజాబ్‌ విడుదల చేసిన ఆటగాడు షారుఖ్‌ ఖాన్‌ ఆర్సీబీ సొంతం చేసుకోవచ్చనే అంశంపై మాట్లాడతూ.. అతడు (షారుఖ్‌ ఖాన్‌) స్థిరంగా రాణిస్తున్న బలమైన ఆటగాడన్నాడు. మాతోపాటు అతడిని కొనుగోలు చేయడానికి చాలా జట్లు పోటీపడవచ్చని అంచనావేశాడు. ఈ విషయంలో సీఎస్‌కేతో పోటీ ఉండొచ్చని డివిలియర్స్‌ పేర్కొన్నాడు. 

సూపర్‌ కింగ్స్‌కు ఆరోసారి ఐపీఎల్‌ టైటిల్‌ను అందించేందుకు 2023 సీజన్‌లో ధోనీ విపరీతంగా శ్రమించాడు. ఆ లీగ్‌ సమయంలో ధోనీ మోకాలి సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. 16 మ్యాచ్‌ల్లో 184 స్ట్రైక్‌ రేట్‌తో 104 పరుగులు చేశాడు. అప్పట్లోనే తాను మరో ఐపీఎల్‌లో ఆడేందుకు వస్తానని ధోనీ ప్రకటించాడు.  ప్రస్తుతం మోకాలి గాయానికి శస్త్రచికిత్స చేయించుకుని కోలుకున్నాడు. వచ్చే ఐపీఎల్ సీజన్‌ కోసం సమాయత్తమవుతున్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని