AB de Villiers: విరుష్క దంపతులకు వారసుడు.. ఏబీ డివిలియర్స్‌పై మీమ్స్‌

AB de Villiers: విరాట్‌ కోహ్లీ మరోసారి తండ్రి కాబోతున్నాడంటూ సమాచారం ఇచ్చి నాలుక్కరుచుకున్నాడు ఏబీడీ. అకాయ్‌ పుట్టిన తర్వాత మీమర్స్‌కు దొరికాడు.

Published : 23 Feb 2024 02:17 IST

AB de Villiers | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ క్రికెటర్‌ విరాట్ కోహ్లీ, బాలీవుడ్‌ నటి అనుష్క దంపతులు పండంటి మగ బిడ్డకు జన్మినిచ్చారు. ఈవిషయాన్ని వారే స్వయంగా తెలిపారు.  బిడ్డ పేరు అకాయ్‌ అని కూడా పేర్కొన్నారు. ఈక్రమంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఏబీ డివిలయర్స్‌ వార్తల్లో నిలిచాడు. అకాయ్‌ పుట్టిన తర్వాత ఎక్స్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

ఇంగ్లాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు కోహ్లీ వ్యక్తిగత కారణాలతో దూరమైన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే డివిలియర్స్‌ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో మాట్లాడుతూ.. అసలు విషయం బయట పెట్టేశాడు. విరుష్క దంపతులు రెండో బిడ్డకు జన్మినివ్వనున్నారనే విషయాన్ని వెల్లడించగా, ఆ వీడియో వైరల్‌గా మారింది. దీంతో నాలుక్కరుచుకున్నాడు. అంతలోనే విరాట్‌ ఎందుకు అందుబాటులో లేడనేది తనకూ స్పష్టత లేదని పేర్కొన్నాడు. కోహ్లీ కుటుంబానికి క్షమాపణ కూడా చెప్పాడు.

ఐపీఎల్‌లో బెంగళూరు జట్టులో విరాట్‌- ఏబీడీ భాగస్వాములన్న సంగతి తెలిసిందే. వీరి మధ్య మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. ఈ క్రమంలోనే తనకు తెలిసిన విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేప్పేశాడు ఏబీడీ. అయితే, అకాయ్‌ జననం గురించి ఫిబ్రవరి 20న విరాట్‌, అనుష్క జంటే అధికారికంగా వెల్లడించింది. దీంతో డివిలియర్స్‌ తొలిసారి చెప్పిందే నిజమైనట్లయ్యింది. ఈ క్రమంలో ఏబీడీపై కొన్ని మీమ్స్‌ పుట్టుకొచ్చాయి. భవిష్యత్‌లో అకాయ్‌, రిచర్డ్‌ (ఏబీడీ కుమారుడు) 2045 ఆర్‌సీబీ జట్టులో ఒకరు మీమ్‌ క్రియేట్‌ చేయగా.. అకాయ్‌ను బాహుబలితో ఏబీడీని కట్టప్పతో పోలుస్తూ మరొకరు మీమ్‌ క్రియేట్‌ చేశారు.

 

 




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని