French Open 2024: 20 ఏళ్ల తర్వాత ముగ్గురు దిగ్గజాలు లేకుండా ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్!

ఫ్రెంచ్‌ ఓపెన్ ఫైనల్‌ తుది దశకు చేరుకుంది. విజేతగా నిలిచేదెవరు? అని తేలడానికి ఆదివారం వరకూ వేచి చూడాల్సిందే. అయితే, ఈసారి ఎవరు గెలిచినా కొత్త ఛాంపియనే.

Published : 08 Jun 2024 01:50 IST

ఇంటర్నెట్ డెస్క్‌: రోజర్‌ ఫెదరర్‌, రఫేల్ నాదల్, నొవాక్ జకోవిచ్.. టెన్నిస్‌ అభిమానులకు సుపరిచితులైన స్టార్లు. 20 ఏళ్ల తర్వాత ఈ ముగ్గురిలో ఒక్కరూ లేకుండా ఫ్రెంచ్ ఓపెన్‌ (French Open Final 2024) ఫైనల్‌ జరగబోతోంది. ఇప్పటికే రోజర్ ఫెదరర్‌ ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. నాదల్, జకోవిచ్ కూడా ఈసారి సెమీస్‌కూ చేరలేదు. మోకాలి గాయం కారణంగా జకోవిచ్ క్వార్టర్‌ ఫైనల్స్‌కు ముందే టోర్నీ నుంచి వైదొలిగాడు. ఇక నాదల్‌ అయితే తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. 2004 నుంచి రోజర్, నాదల్, జకోవిచ్‌ లేకుండా ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌ లేదు. 2009లో రోజర్ ఒక్కడే ఫైనల్‌కు చేరుకుని విజేతగా నిలిచాడు. 

ఈసారి ఫైనల్‌కు చేరింది వీరే..

తొలి సెమీస్‌లో ఇటలీ ఆటగాడు జినిక్ సినర్‌పై స్పెయిన్‌ యువ కెరటం కార్లోస్ అల్కరాజ్‌ 2-6, 6-3, 3-6, 6-4, 6-3 తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరాడు. ఇక రెండో సెమీస్‌లో నార్వే స్టార్ రూడ్‌పై జర్మనీ సంచలనం అలెగ్జాండర్ జ్వెరెవ్‌ 2-6, 6-2, 6-4, 6-2 తేడాతో గెలిచి ఫైనల్‌కు వెళ్లాడు. గతేడాది సెమీస్‌కు చేరిన అల్కరాజ్‌ ఈసారి విజేతగా నిలిచేందుకు తీవ్రంగా కృషి చేశాడు. మరోవైపు వరుసగా నాలుగేళ్లు సెమీస్‌కే పరిమితమైన జ్వెరెవ్ తొలిసారి ఫైనల్‌కు వచ్చాడు. ఈసారి ఎవరు గెలిచినా మొదటిసారి ఛాంపియన్‌గా నిలవడం విశేషం. ఆదివారం (జూన్ 9న) ఫ్రెంచ్‌ ఓపెన్ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని