Delhi Vs Hyderabad: దిల్లీపై హైదరాబాద్‌ భారీ విక్టరీ.. నమోదైన రికార్డులివీ..!

ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్ల జాబితాలో ఇప్పటికే టాప్‌లో ఉన్న హైదరాబాద్‌.. మరోసారి అలాంటి ప్రదర్శనే దిల్లీపై చేసింది.

Published : 21 Apr 2024 11:55 IST

ఇంటర్నెట్ డెస్క్‌: హైదరాబాద్‌ బ్యాటర్లు మరోసారి విజృంభించారు. దిల్లీని వారి సొంతమైదానంలో చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించారు. మరోసారి ఐపీఎల్‌లో రికార్డు స్కోరును నమోదు చేశారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్ 266/7 స్కోరు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో దిల్లీ 199 పరుగులకు ఆలౌటైంది. దీంతో పాయింట్ల పట్టికలో హైదరాబాద్ రెండో స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌ సందర్భంగా నమోదైన రికార్డులు ఇవీ.. 

  • అర్ధశతకానికి హెడ్‌ ఆడిన బంతులు 16. సన్‌రైజర్స్‌ తరపున అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీ రికార్డు (ఈ సీజన్‌లోనే ముంబయిపై అభిషేక్‌)ను హెడ్‌ సమం చేశాడు.
  • పవర్‌ప్లేలో సన్‌రైజర్స్‌ 24 బౌండరీలు కొట్టింది. పురుషుల టీ20ల్లో ఇదే ప్రపంచ రికార్డు. శ్రీలంక రికార్డు (2014లో ససెక్స్‌పై 20) కనుమరుగైంది. తొలి ఆరు ఓవర్లలో సన్‌రైజర్స్‌ 11 సిక్సర్లు కొట్టడమూ రికార్డే.
  • 100 పరుగులు దాటేందుకు సన్‌రైజర్స్‌కు అవసరమైన ఓవర్లు 5. పురుషుల టీ20ల్లో అత్యంత వేగంగా ఆ ఘనత సాధించిన జట్టుగా సన్‌రైజర్స్‌ నిలిచింది. గత రికార్డు దక్షిణాఫ్రికా (2023లో వెస్టిండీస్‌పై 5.3 ఓవర్లలో) పేరు మీద ఉంది. అలాగే తక్కువ ఓవర్ల (8.4)లో 150 పరుగులు చేసిన రికార్డు కూడా సన్‌రైజర్స్‌దే.  
  • పవర్‌ప్లేలో 125 పరుగులను సన్‌రైజర్స్‌ చేసింది. పురుషుల టీ20ల్లో పవర్‌ప్లేలో నమోదైన అత్యధిక స్కోరు ఇదే. నాటింగ్‌హమ్‌షైర్‌ (2017లో డర్హంపై 106) రికార్డును సన్‌రైజర్స్‌ తిరగరాసింది.
  • తొలి పది ఓవర్లలో సన్‌రైజర్స్‌ స్కోరు 158/4. ఐపీఎల్‌లో పది ఓవర్లలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా తన రికార్డు (ముంబయిపై 148)ను సన్‌రైజర్స్‌ మెరుగుపర్చుకుంది.
  • 15.. అర్ధసెంచరీకి ఫ్రేజర్‌ ఆడిన బంతులు. ఈ సీజన్‌లో ఇదే వేగవంతమైన అర్ధసెంచరీ. దిల్లీ తరపున మోరిస్‌ (17) రికార్డును అతను బద్దలుకొట్టాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో ఇది మూడో వేగవంతమైన అర్ధశతకం. యశస్వి (13), కేఎల్‌ రాహుల్‌, కమిన్స్‌ (14) ముందున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని