T20 World Cup: ఒకే ఓవర్‌లో నాలుగు సిక్స్‌లు.. స్టాయినిస్‌ విధ్వంసం చూశారా?

T20 World Cup: ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ స్టార్‌ స్టాయినిస్‌ రెచ్చిపోయాడు. ఒకే ఓవర్‌లో ఏకంగా నాలుగు సిక్స్‌లు బాది 26 పరుగులు రాబట్టాడు.

Published : 06 Jun 2024 17:27 IST

బార్బడోస్‌: టీ20 ప్రపంచకప్‌ టోర్నీ (T20 World Cup 2024)ని ఆస్ట్రేలియా ఘనంగా ఆరంభించింది. కెన్సింగ్టన్‌ ఓవల్‌ వేదికగా గురువారం ఒమన్‌ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌ (AUS vs OMAN) లో 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టాయినిస్‌ (Marcus Stoinis) అటు బ్యాట్‌తోనూ, ఇటు బంతితోనూ ఆకట్టుకున్నాడు.

తొలుత ఆస్ట్రేలియా (Australia) ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో చెలరేగిన స్టాయినిస్‌ (67*; 36 బంతుల్లో).. ఒమన్‌ ఆటగాడు మెహ్రాన్‌ఖాన్‌ బౌలింగ్‌లో విధ్వంసం చూపించాడు. అతడు వేసిన 15వ ఓవర్‌లో ఏకంగా నాలుగు సిక్స్‌లు (2, 6, 6, 0, 6, 6) బాది 26 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ మెరిసి 19 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. స్టాయినిస్‌, వార్నర్‌ (56) అర్ధశతకాలతో రాణించాడు. ఆ తర్వాత ఛేదనకు దిగిన ఒమన్‌ను ఆసీస్‌ 125 పరుగులకే కట్టడి చేసింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు