MS Dhoni: ధోనీపై క్రికెటర్‌ భార్య ఎమోషనల్‌ పోస్టు..

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎమ్‌ఎస్‌ ధోనీపై తనకున్న అభిమానాన్ని పంచుకున్నారు మరో క్రికెటర్‌ శివమ్‌ దూబె భార్య అంజుమ్‌ ఖాన్.

Published : 21 Apr 2024 16:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్: టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీని అభిమానించని వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఐపీఎల్‌లో చెన్నై ఎక్కడ ఆడినా అతడిని చూడటానికే అభిమానులు వస్తున్నారంటే ఆ క్రేజ్‌ మాటల్లో చెప్పలేం. తాజాగా జట్టు సహచరుడు శివమ్‌ దూబె భార్య అంజుమ్‌ ఖాన్ (Anjum Khan) సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టు నెటిజన్లను ఆకట్టుకుంది.

‘‘మహీ టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రోజులవి. మొదటిసారి ఓ న్యూస్‌ ఛానెల్‌లో ధోనీ పేరు విన్నా. అతని గురించి తెలియనంత వరకు నాకు క్రికెట్‌ అంటే ఇష్టం మాత్రమే ఉండేది. కానీ, నాకు తెలియకుండానే నాడు ఆ ఇంటర్వ్యూ మొత్తం ఎందుకు చూశానో తెలియదు. అది సాధారణంగా అనిపించలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు క్రికెట్‌ మ్యాచ్‌లన్నీ చూస్తుంటా. ధోనీ ఆడే మ్యాచ్‌ను మాత్రం అసలు మిస్సవ్వను. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు మహీ ఉంటే గెలిపిస్తాడనే ధైర్యం ఉంటుంది. ధోనీ అంటే క్రికెట్‌.. క్రికెట్‌ అంటే ధోనీ’’ అని పోస్టు చేశారు.

ధోనీ కోసం ఇంకాస్త అరుస్తా.. 

‘‘మొదటి సారి ధోనీని చూసినప్పుడు పొడవాటి హెయిర్‌ స్టైల్‌తో కనిపించారు. అప్పుడు నాకు నా బాల్యం గుర్తుకు వచ్చింది. ఎంతో ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యా. ఆయనను కలవాలనే ఆశ నా భర్త శివమ్‌ ద్వారా నెరవేరింది. మ్యాచ్‌ జరుగుతుండగా.. శివమ్‌కు మద్దతుగా అరుస్తూ ఉండేదాన్ని. కానీ, అక్కడ ధోనీ ఉంటే మాత్రం ఇంకాస్త ఎక్కువగానే కేకలు వేస్తుంటా. ఆయన టీమ్‌లో శివమ్‌ కూడా ఉండాలని నా కోరిక. ఆయన నుంచి ఎంతో నేర్చుకోవాలి’’ అని పంచుకున్నారు. అంజుమ్‌ పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది.

సగం IPL పూర్తి.. బాదుడు నుంచి ఫ్లైయింగ్‌ కిస్‌ వరకు... ఆసక్తికర విశేషాలివే!

‘అంజుమ్‌.. ఈ రోజు మీరూ మా అభిమానాన్ని గెలుచుకున్నారు’, ‘మీరు ఎంతో భావోద్వేగంగా ఈ పోస్టు పెట్టినట్లు అర్థమవుతోంది’’ అంటూ పలువురు కామెంట్లు పెట్టారు. శివమ్‌ దూబె, అంజుమ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని