ICC Rankings: ఐసీసీ ర్యాంకుల్లో దూసుకెళ్లిన భారత యువ క్రికెటర్లు

టీమ్ఇండియా కుర్రాళ్లు ఐసీసీ ర్యాంకుల్లోనూ మెరుపులు మెరిపించారు. తాజాగా టీ20 ఫార్మాట్ ర్యాంకులను ప్రకటించింది.

Published : 29 May 2024 16:37 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ ముంగిట భారత క్రికెటర్లకు ఉత్సాహాన్నిచ్చేలా ఐసీసీ ర్యాంకుల్లో ప్రతిభ చూపారు. భారత యువ క్రికెటర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌, అక్షర్ పటేల్‌ ఐసీసీ ర్యాంకుల్లో ముందుకొచ్చారు. టీ20 ఫార్మాట్‌లో తాజాగా ఐసీసీ ర్యాంకులను ప్రకటించింది. అక్షర్‌ పటేల్ (660 పాయింట్లు) ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని మూడో ర్యాంక్‌కు చేరాడు. అర్ష్‌దీప్‌ సింగ్‌ మూడు స్థానాలు పైకి ఎగబాకి 16వ ర్యాంకును అందుకొన్నాడు. ఈ జాబితాలో రవి బిష్ణోయ్ (659) ఐదో స్థానంలో ఉన్నాడు. 

టీ20 బ్యాటింగ్‌ విభాగంలో మాత్రం సూర్యకుమార్‌ యాదవ్‌ (Surya kumar Yadav) తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రస్తుతం అతడు 861 పాయింట్లతో తొలి ర్యాంకులో నిలిచాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ బ్యాటర్ ఫిల్ సాల్ట్ (788), రిజ్వాన్ (769), బాబర్ అజామ్ (761), మార్‌క్రమ్ (733) టాప్ -5లో ఉన్నారు. భారత యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (714) ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని ఆరో ర్యాంకుకు చేరాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో టీమ్‌ఇండియా నుంచి టాప్‌ -5లో ఎవరూ లేరు. శ్రీలంక క్రికెటర్ హసరంగ (228) టాప్‌ ర్యాంకర్. వరల్డ్‌ కప్‌లో భారత జట్టు వైస్‌ కెప్టెన్ హార్దిక్ పాండ్య (185) ఒక్కడే ఆరో స్థానంలో నిలిచాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని