CSK: మళ్లీ సీఎస్కే గూటికి అశ్విన్‌

భారత ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మళ్లీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ గూటికి చేరుకున్నాడు. సీఎస్కే హై పర్ఫార్మెన్స్‌ సెంటర్, అకాడమీలకు అశ్విన్‌ నాయకత్వం వహించనున్నాడు. 2025 ఐపీఎల్‌ సీజన్‌కు ముందు ఆరంభమయ్యే సెంటర్‌తో పాటు దేశవ్యాప్తంగా అకాడమీలలో అశ్విన్‌ కీలకపాత్ర పోషించనున్నాడు.

Published : 06 Jun 2024 03:49 IST

దిల్లీ: భారత ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మళ్లీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ గూటికి చేరుకున్నాడు. సీఎస్కే హై పర్ఫార్మెన్స్‌ సెంటర్, అకాడమీలకు అశ్విన్‌ నాయకత్వం వహించనున్నాడు. 2025 ఐపీఎల్‌ సీజన్‌కు ముందు ఆరంభమయ్యే సెంటర్‌తో పాటు దేశవ్యాప్తంగా అకాడమీలలో అశ్విన్‌ కీలకపాత్ర పోషించనున్నాడు. తాజా పరిణామంతో రానున్న ఆటగాళ్ల మెగా వేలంలో అశ్విన్‌ను చెన్నై సొంతం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ‘‘భారత్, తమిళనాడుకు చెందిన గొప్ప ఆటగాళ్లలో అశ్విన్‌ ఒకడు. అతని రాకతో హై పర్ఫార్మెన్స్‌ సెంటర్, అకాడమీలకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆటగాళ్ల వేలం మన నియంత్రణలో ఉండదు. ఏం జరుగుతుందో చూద్దాం’’ అని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు