T20 World Cup 2024: మైదానంలోకి కోచ్‌ - చీఫ్ సెలక్టర్.. వార్మప్‌ మ్యాచ్‌లో ఆసీస్‌దే విజయం

అనూహ్య పరిణామాలతో ఆసీస్‌ తన తొలి వార్మప్‌ మ్యాచ్‌లో కేవలం 9 మంది ప్రధాన ఆటగాళ్లతోనే బరిలోకి దిగాల్సి వచ్చింది. దీంతో ఆ జట్టు కోచింగ్‌ సిబ్బంది మైదానంలోకి దిగడం విశేషం.

Published : 29 May 2024 12:13 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో ఆడటం వల్ల ఆస్ట్రేలియా క్రికెటర్లు కొందరు ఇంకా విండీస్‌ చేరలేదు. కొందరికి గాయాలు కావడంతో వార్మప్ మ్యాచ్‌లో ఆడేందుకు కనీసం 11 మంది కూడా అందుబాటులో లేకుండాపోయారు. దీంతో నమీబియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఆసీస్‌ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ, ప్రధాన కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ మైదానంలోకి దిగారు. వారితోపాటు ఇతర సహాయక సిబ్బంది కూడా ఫీల్డింగ్‌ చేశారు. జూన్ 5లోగానే కమిన్స్‌తోపాటు ఇతర క్రికెటర్లు విండీస్‌కు చేరుకుంటారు. ఆ రోజే వరల్డ్‌ కప్‌లో ఒమన్‌తో ఆసీస్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది.  

ఫామ్‌లోకి వచ్చిన వార్నర్

ఐపీఎల్‌లో పెద్దగా ఆకట్టుకోని డేవిడ్ వార్నర్ మళ్లీ తన మునుపటి ఫామ్‌లోకి వచ్చాడు. నమీబియాను 119/9 స్కోరుకే కట్టడి చేసిన ఆసీస్‌.. లక్ష్య ఛేదనలో కేవలం 10 ఓవర్లలోనే పూర్తి చేసింది. డేవిడ్ వార్నర్ 21 బంతుల్లో 54 పరుగులు చేశాడు. టిమ్‌ డేవిడ్ (23), మ్యాథ్యూ వేడ్ (12*) దంచేశారు. ఈ మ్యాచ్‌ ఫీల్డింగ్‌ సమయంలో కెప్టెన్‌ మిచెల్ మార్ష్ గాయం కారణంగా మధ్యలోనే డగౌట్‌కు వెళ్లాడు. అయితే, తన ఇంజూరీ పెద్ద సమస్య కాదని ఆ తర్వాత మార్ష్ వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని