India vs Pakistan: భారత్‌తో మ్యాచ్‌ అంటే.. మాకూ టెన్షనే: బాబర్ అజామ్‌

టీమ్‌ఇండియాతో జరగబోయే వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌పై పాకిస్థాన్‌ కెప్టెన్ బాబర్‌ అజామ్‌ స్పందించాడు.

Published : 03 Jun 2024 00:04 IST

ఇంటర్నెట్ డెస్క్: వరల్డ్‌ కప్‌నకే ఆకర్షణగా నిలిచే భారత్ - పాకిస్థాన్‌ (IND vs PAK) మ్యాచ్ జూన్ 9న జరగనుంది. మెగా టోర్నీల్లోనే తలపడుతున్న ఇరు జట్ల గత వన్డే ప్రపంచ కప్‌లో చివరిసారిగా ఢీకొన్నాయి. ఇప్పటి వరకు పాక్‌పై భారత్‌దే ఆధిపత్యం. ఈసారి మాత్రం పోటీ తీవ్రంగా ఉంటుందని క్రికెట్ విశ్లేషకుల అంచనా. ఈ క్రమంలో టీమ్‌ఇండియాతో మ్యాచ్‌పై పాకిస్థాన్‌ కెప్టెన్ బాబర్ అజామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘‘భారత్ - పాక్‌ జట్ల మధ్య మ్యాచ్‌ ఎప్పుడు జరిగినా చర్చ భారీ స్థాయిలో ఉంటుంది. ఆటగాళ్లలోనూ ఉత్సాహం వేరే స్థాయిలో ఉంటుంది. తమ అభిమాన జట్టు గెలవాలని ఆయా దేశాల ఫ్యాన్స్‌ కోరుకుంటారు. ప్లేయర్లుగా మాకూ కాస్త టెన్షన్ రావడం సహజమే. ప్రాథమిక సూత్రాలకు లోబడి మాదైన శైలిలో క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తాం. తీవ్ర ఒత్తిడి ఉండే మ్యాచ్. కూల్‌గా ఉండి ఆడగలిగితే ఫలితం అనుకూలంగా వస్తుందని నమ్ముతా. దానికి తగ్గట్టు సాధన చేయాల్సిందే. 

కెప్టెన్‌గా నాపై అంచనాలు భారీగానే ఉంటాయి. ఇలాంటి మెగా టోర్నీల్లో అవి మరింత ఎక్కువ. భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. ఆటగాళ్లకు మద్దతుగా నిలిచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టేలా చేయాలి. ఆత్మవిశ్వాసం కలిగేలా ప్రయత్నిస్తే చాలు. భారత్ - పాక్‌ జట్లను చూస్తే సమతూకంగానే ఉన్నాయి. ఆ రోజు ఎవరు బాగా ఆడితే వారిదే విజయం’’ అని బాబర్ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని