BCCI: సెలక్టర్‌ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం.. తప్పించేది అతడినేనా?

పురుషుల సీనియర్‌ జాతీయ సెలక్షన్ కమిటీలో ఒక సెలక్టర్‌ పోస్టు కోసం బీసీసీఐ (BCCI) దరఖాస్తులను ఆహ్వానించింది. 

Published : 16 Jan 2024 02:39 IST

ఇంటర్నెట్ డెస్క్: పురుషుల సీనియర్‌ జాతీయ సెలక్షన్ కమిటీలో ఒక సెలక్టర్‌ పోస్టు కోసం బీసీసీఐ (BCCI) దరఖాస్తులను ఆహ్వానించింది. గత ఏడాది జులైలో చేతన్ శర్మ స్థానంలో అజిత్ అగార్కర్‌ (Ajit Agarkar) సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుత సెలక్షన్‌ ప్యానెల్‌లో సలీల్ అంకోలా (వెస్ట్), శివ సుందర్‌ దాస్‌ (ఈస్ట్), శ్రీధరన్‌ శరత్ (సౌత్‌), సుబ్రతో బెనర్జీ (సెంట్రల్‌) జోన్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అజిత్ అగార్కర్‌ కూడా వెస్ట్ జోన్‌ నుంచే సభ్యుడిగా ఉన్నాడు. ఒక జోన్‌ నుంచి ఒక్క సెలక్టర్‌ మాత్రమే ఉండాలనే నిబంధన బీసీసీఐ రాజ్యాంగంలో ఉంది. దీంతో సలీల్‌ అంకోలాను తప్పించి ప్రస్తుతం ప్రాతినిధ్యం లేని నార్త్ జోన్‌ నుంచి ఒకరిని తీసుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 26 తేదీ సాయంత్రం ఆరు గంటలలోపు దరఖాస్తులు చేసుకోవాలని ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. 

ఉండాల్సిన అర్హతలు: 

  • కనీసం 7 టెస్టు మ్యాచ్‌లు లేదా 30 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి ఉండాలి.
  • క్రికెట్‌కు వీడ్కోలు పలికి దాదాపు ఐదేళ్లు పూర్తి కావాలి. 
  • మొత్తం 5 సంవత్సరాల పాటు ఏదైనా క్రికెట్ కమిటీలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి  దరఖాస్తు చేసుకొనేందుకు అనర్హుడు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని