ODI WC 2023: వారిద్దరిలో ఎవరికి చోటు..? వీరిద్దరిపైనేనా వేటు? వరల్డ్‌ కప్ కోసం భారత జట్టు ప్రకటన నేడేనా?

వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) కోసం జట్టును ప్రకటించాల్సిన సమయం దగ్గర పడుతోంది. ఇవాళే భారత స్క్వాడ్‌ (Team India) ఎంపిక ఉంటుందని వార్తలు వస్తున్నాయి. దీంతో ఎవరికి చోటు దక్కుతుంది.. ఎవరిని పక్కన పెడతారనేది ఆసక్తికరంగా మారింది.

Published : 03 Sep 2023 10:35 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అక్టోబర్ 5 నుంచి భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) జరగనుంది. ఇప్పటికే కొన్ని దేశాలు ప్రాథమిక జట్లను ప్రకటించాయి. ప్రస్తుతం టీమ్‌ఇండియా (Team India)ఆసియా కప్‌ (Asia Cup 2023) ఆడుతోంది. శనివారం పాకిస్థాన్‌తో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. గ్రూప్‌ స్టేజ్‌లో సోమవారం నేపాల్‌తో భారత్‌ తలపడనుంది. మరోవైపు సెప్టెంబర్‌ 4లోపు (సోమవారం) వరల్డ్‌ కప్‌ కోసం స్క్వాడ్‌ను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌ అజిత్‌ అగార్కర్‌ ప్రత్యేకంగా చర్చించి ఇవాళే 15 మందితో కూడిన జట్టును ప్రకటిస్తారనే కథనాలు వస్తున్నాయి. ఆసియా కప్‌ కోసం ప్రకటించిన జట్టునే కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, బీసీసీఐ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

ఊరించి.. ఉసూరుమనిపించి.. 16 ఏళ్ల తర్వాత మళ్లీ మ్యాచ్‌ రద్దు

ఆసియా కప్‌లోని తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన కేఎల్ రాహుల్‌ ఫిట్‌నెస్‌ నిరూపించుకోగలిగితే అతడినే ఎంపిక చేసే అవకాశం ఉంది. దీంతో సంజూ శాంసన్ మరోసారి రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం అవ్వొచ్చు. ఆసియా కప్‌లోనూ సంజూ స్టాండ్‌బై ప్లేయర్‌గానే ఉన్నాడు. ప్రస్తుతం 17 మందితో ఉన్న ఆసియా కప్‌ జట్టులో నుంచి ఇద్దరిని పక్కన పెట్టాల్సి ఉంటుంది. దీంతో యువ క్రికెటర్లు తిలక్‌ వర్మ, ప్రసిధ్ కృష్ణను తప్పించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వన్డేల్లో గొప్పగా రాణించలేకపోతున్ననప్పటికీ సూర్యకుమార్‌ యాదవ్‌ మాత్రం జట్టులోకి రావచ్చు. పేసర్లుగా బుమ్రా, షమీ, సిరాజ్‌, శార్దూల్, హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌ను నడిపిస్తారు. అయితే.. చాహల్‌కు మరోసారి నిరాశ తప్పకపోవచ్చు. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా చాహల్‌కు బదులు కుల్‌దీప్‌ యాదవ్‌ను తీసుకోవడం ఖాయం. స్పిన్‌ ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఉన్నారు. 

భారత స్క్వాడ్‌ (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య (వైస్‌ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్‌ గిల్, శ్రేయస్‌ అయ్యర్, సూర్యకుమార్‌ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్‌ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు