T20 World Cup 2024:: ఇంగ్లాండ్‌కు షాక్‌.. టీ20 ప్రపంచకప్‌కు స్టార్‌ ఆల్‌రౌండర్‌ దూరం

2024  టీ20 ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లాండ్‌కు షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్ (Ben Stokes) టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. 

Published : 02 Apr 2024 21:49 IST

ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది జూన్‌ 1 నుంచి టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup2024) మొదలుకానుంది. ఈ మెగా టోర్నీకి యూఎస్ఏ, వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. అయితే, టీ20 ప్రపంచకప్‌ ముందు ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌ (Ben Stokes) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. జట్టు ఎంపికలో తనను పరిగణించకూడదని టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు చెప్పాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌గా సేవలందించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టోక్స్‌ తెలిపాడు. ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నానని పేర్కొన్నాడు. ఈ ఆల్‌రౌండర్‌ ఐపీఎల్‌ 17 సీజన్‌కు కూడా దూరంగా ఉన్నాడు. 

2022లో వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టోక్స్‌.. 2023 ప్రపంచకప్‌ ముందు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. వరల్డ్ కప్‌ తర్వాత మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. ఇటీవల ఇంగ్లాండ్ జట్టు టెస్టు సిరీస్‌ కోసం భారత్‌లో పర్యటించింది. ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో బెన్‌స్టోక్స్‌ కేవలం ఐదు ఓవర్లే బౌలింగ్‌ చేశాడు. టెస్టు సిరీస్‌ను భారత్‌ 4-1 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. జూన్‌ 4న స్కాట్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో ఇంగ్లాండ్‌ టీ20 ప్రపంచకప్‌ సమరం మొదలుకానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు