IPL Final Match: ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌.. ఈ తారల సందడి చూశారా..?

చెన్నై వేదికగా జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌లో కోల్‌కతా ఛాంపియన్‌ నిలిచింది. ఈమ్యాచ్‌కు పలువురు సినీ తారలు హాజరై సందడి చేశారు.     

Published : 27 May 2024 00:09 IST

చెన్నై: ఐపీఎల్‌ ఫైనల్‌లో హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి మూడోసారి ఛాంపియన్‌గా కోల్‌కతా అవతరించింది. దీంతో రెండు నెలలకు పైగా సాగిన మెగా టోర్నీ ముగిసింది. ఫైనల్‌ మ్యాచ్‌కు పలువురు సినీ తారలు హాజరై సందడి చేశారు. టాలీవుడ్‌ అగ్రహీరో వెంకటేశ్‌, జాన్వీ కపూర్‌, రాజ్‌కుమార్‌ రావు, అనన్య పాండే, మహేశ్వరీ తదితరులు తళుక్కున మెరిసి అభిమానుల్లో జోష్‌ నింపారు. ఇక కోల్‌కతా టీమ్‌ యాజమాని షారుఖ్‌ ఖాన్‌, అతడి సతీమణి గౌరీ ఖాన్‌, కూతురు సుహానా ఖాన్‌, జుహీ చావ్లా తమ జట్టును ఆద్యంతం ఉత్సాహపరిచారు. కోల్‌కతా బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లు కొట్టినప్పడు చప్పట్లతో మద్దతు తెలిపారు. 

  

చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ తేలిపోయింది. ఈ సీజన్‌లో బ్యాటింగ్‌లో అద్భుతాలు చేసి అలరించిన సన్‌రైజర్స్‌.. ఫైనల్‌లో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ 10.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టులో వెంకటేశ్‌ అయ్యర్‌ (52*) అర్ధశతకంతో మెరుపులు మెరిపించాడు. రహమనుల్లా గుర్జాబ్‌ (39) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని