David Warner: ఆ క్యాప్ నాకెంతో సెంటిమెంట్.. దయచేసి ఇచ్చేయండి.. డేవిడ్ వార్నర్ విజ్ఞప్తి

ఇంటర్నెట్ డెస్క్: జనవరి 3వ తేదీ నుంచి సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య చివరి టెస్టు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌తో ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) టెస్టు కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నాడు. ఈ మ్యాచ్ ముంగిట వార్నర్‌కు షాక్ తగిలింది. అతడి బ్యాగీ గ్రీన్ క్యాప్ (టెస్టుల్లో ధరించే క్యాప్)ని పొగొట్టుకున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు.
‘‘మెల్‌బోర్న్ నుంచి సిడ్నీ వచ్చే క్రమంలో లగేజ్ నుంచి నా బ్యాక్‌ప్యాక్‌ను (బ్యాగ్)ని ఎవరో తీసుకున్నారు. అందులో నా పిల్లల వస్తువులు ఉన్నాయి. నా బ్యాగీ గ్రీన్ క్యాప్ కూడా ఉంది. అది నాకెంతో సెంటిమెంట్. దానిని ధరించి నా చివరి మ్యాచ్ ఆడాలనుకుంటున్నా. కావాలని ఎవరైనా బ్యాక్‌ప్యాక్‌ను తీసుకుంటే వారికి మరో బ్యాక్‌ప్యాక్ ఇస్తాను. మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందికి గురిచేయను. ఎయిర్‌పోర్ట్, హోటల్ సిబ్బందిని కూడా అడిగాను. సీసీటీవీ ఫుటేజీలు కూడా పరిశీలించాం. ఎక్కడ దాని జాడ దొరకలేదు. దయచేసి నా బ్యాగీ గ్రీన్ క్యాప్‌ని తిరిగి ఇస్తే ఎంతో ఆనందిస్తా’’ అని వార్నర్ విజ్ఞప్తి చేశాడు.
తన సొంత మైదానం సిడ్నీలో బుధవారం పాకిస్థాన్‌తో ఆరంభమయ్యే మూడో టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్ నుంచి వైదొలగుతున్నట్లు గతంలోనే వెల్లడించిన వార్నర్.. వన్డేలకూ గుడ్ బై చెబుతున్నట్లు సోమవారం ప్రకటించాడు. భారత్‌లో ఆడిన వన్డే ప్రపంచకప్ ఫైనలే తనకు 50 ఓవర్ల ఫార్మాట్లో చివరి మ్యాచ్ అని పేర్కొన్నాడు. కానీ, జట్టుకు అవసరమైతే 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటానని పేర్కొన్నాడు.
నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ అతడే
చివరి టెస్టు ఆడనున్న వార్నర్ తన కెరీర్‌లో ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ ఎవరో వెల్లడించాడు. సౌతాఫ్రికా పేస్ దిగ్గజం డేల్ స్టెయిన్‌ను ఎదుర్కోవడంలో చాలా ఇబ్బందులు పడినట్లు పేర్కొన్నాడు. ‘‘నా టెస్టు కెరీర్‌లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ డేల్ స్టెయిన్. 2016-17లో గబ్బా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ నాకింకా గుర్తుంది. ఈ మ్యాచ్ మొదటి సెషన్‌లో స్టెయిన్ నిప్పులు చెరిగాడు. బౌన్సర్లు వేసి నాతోపాటు షాన్ మార్ష్‌ను కూడా భయపెట్టాడు. సెషన్‌లో 45 నిమిషాలపాటు మాకు చుక్కలు చూపించాడు. మార్ష్ నా దగ్గరకు వచ్చి ‘‘స్టెయిన్ బౌలింగ్‌లో ఆడలేకపోతున్నా. అతడిని మనం ఎలా ఎదుర్కోవాలో నాకైతే తెలీదు’’ అని చెప్పాడు. స్టెయిన్ నా బ్యాక్‌సైడ్ ఎక్కువగా బంతులు వేశాడు. ఓ బంతి భుజానికి కూడా తగిలింది’’ అని వార్నర్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


