Delhi vs Kolkata: విశాఖలో పరుగుల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు

దిల్లీతో జరుగుతోన్న మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాటర్‌ సునీల్‌ నరైన్‌ (85) చెలరేగి ఆడటంతో ఆ జట్టు భారీ స్కోర్‌ సాధించింది.

Updated : 03 Apr 2024 22:03 IST

విశాఖ: దిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాటర్లు చెలరేగిపోయారు. దీంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం. ఓపెనర్ సునీల్ నరైన్‌ (85; 39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లు) దిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. వన్‌డౌన్‌ బ్యాటర్ రఘువంశీ (54; 27 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శతకంతో చెలరేగాడు. ఆండ్రి రస్సెల్ (41; 19 బంతుల్లో), రింకు సింగ్ (26; 8 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. దిల్లీ బౌలర్లలో నోకియా 3, ఇషాంత్ శర్మ 2, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్‌ తలో వికెట్ పడగొట్టారు. 

హైదరాబాద్‌ రికార్డుకు ఐదు పరుగుల దూరంలోనే..

19 ఓవర్లకు 264/5 స్కోరుతో ఉన్న కోల్‌కతా.. హైదరాబాద్‌ పేరిట ఉన్న అత్యధిక స్కోరు (277) రికార్డును సునాయసంగా బ్రేక్‌ చేసేలా కనిపించింది. కానీ, చివర్లో ఇషాంత్ శర్మ రెండు వికెట్లు (రస్సెల్‌, రమణ్‌దీప్‌ సింగ్‌) పడగొట్టి ఎనిమిది పరుగులే ఇచ్చి కోల్‌కతా బ్యాటర్లను నిలువరించాడు. దీంతో హైదరాబాద్‌ రికార్డును బ్రేక్‌ చేసే దిశగా దూసుకెళ్లిన కోల్‌కతా కేవలం ఐదు పరుగుల దూరంలోనే నిలిచిపోవాల్సి వచ్చింది.

ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక టాప్‌ 5 స్కోర్లు ఇవే..

  • హైదరాబాద్‌ 277/3 Vs ముంబయి
  • కోల్‌కతా 272/7  Vs దిల్లీ
  • బెంగళూరు 263/5 Vs పుణె
  • లఖ్‌నవూ 257/5  Vs పంజాబ్‌
  • బెంగళూరు 248/3 Vs గుజరాత్‌ లయన్స్‌
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు