Delhi vs Chennai: హ్యాట్రిక్‌పై కన్నేసిన చెన్నైకి ఝలక్‌.. ఖాతా తెరిచిన దిల్లీ

చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించి మెగా టోర్నీలో ఖాతా తెరిచింది.  

Updated : 31 Mar 2024 23:50 IST

విశాఖపట్నం: ఐపీఎల్‌ 2024లో దిల్లీ (Delhi) జట్టు ఎట్టకేలకు ఖాతా తెరిచింది. విశాఖ వేదికగా చెన్నై (Chennai)తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌లో 191 పరుగులు చేసిన దిల్లీ.. అనంతరం బౌలింగ్‌లో చెన్నైని 171 పరుగులకే కట్టడి చేసింది. ఆ జట్టులో రహానె (45: 30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌. చివర్లో ధోనీ (37*; 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (1), రచిన్ రవీంద్ర (2) ఘోరంగా విఫలమవడం చెన్నైకి ప్రతికూలంగా మారింది. డారిల్ మిచెల్ (34; 26 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) రాణించాడు. శివమ్ దూబె (18), రవీంద్ర జడేజా (21*) పరుగులు చేశారు. దిల్లీ బౌలర్లలో ముకేశ్‌ కుమార్‌ 3, ఖలీల్‌ అహ్మద్‌ 2, అక్షర్‌ పటేల్‌ ఒక వికెట్‌ తీశారు. 

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్‌ (52: 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), పృథ్వీ షా (43: 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యం అందించారు. స్వల్ప తేడాతో వీరిద్దరూ ఔటైనప్పటికీ.. మార్ష్‌ (18) సహాయంతో పంత్‌ (51: 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకంతో చెలరేగాడు. దీంతో దిల్లీ భారీ స్కోర్‌ నమోదు చేసింది. చెన్నై బౌలర్లలో పతిరన మూడు వికెట్లు తీయగా, ముస్తాఫిజుర్‌, జడేజా తలో వికెట్‌ తీశారు. 

మ్యాచ్‌ విశేషాలు

  • ఈ సీజన్‌లో ధోనీ బ్యాటింగ్‌కు దిగడం ఇదే తొలిసారి. 
  • రోడ్డు ప్రమాదంలో గాయపడిన తర్వాత మొదటిసారి ఐపీఎల్ ఆడుతున్న రిషభ్‌ పంత్ హాఫ్‌ సెంచరీ చేయడం ఇదే మొదటిసారి. 
  • ఈ సీజన్‌లో దిల్లీ ఓపెనర్ పృథ్వీ షాకు ఇది మొదటి మ్యాచ్‌. ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లోనే ధనాధన్ ఆటతీరుతో అలరించాడు.   
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని