RCB: ఇకపై ప్రతీ మ్యాచ్‌ మాకు సెమీఫైనల్‌ లాంటిది: ఆర్సీబీ హెడ్‌ కోచ్‌

ఇకపై తాము ఆడే ప్రతీ మ్యాచ్‌ సెమీఫైనల్‌ లాంటిదేనని ఆర్సీబీ (RCB) హెడ్ కోచ్ ఆండ్లీ ప్లవర్‌ అన్నాడు. 

Published : 16 Apr 2024 19:23 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో ఆర్సీబీ (RCB) ఓటముల పరంపర కొనసాగుతోంది. సోమవారం హైదరాబాద్‌తో జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. బెంగళూరుకు ఇది వరుసగా ఐదో పరాజయం. ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడి ఒకే విజయం సాధించిన ఆ జట్టు.. ప్లే ఆఫ్స్‌కు రావాలంటే మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లోనూ గెలవాల్సిన పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా జరగడం కష్టమే అని చెప్పొచ్చు. కానీ, టీ20 మ్యాచ్‌ల్లో ఎప్పుడూ, ఏదైనా జరగొచ్చు. ఈనేపథ్యంలో హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఓటమి అనంతరం ఆర్సీబీ హెడ్ కోచ్‌ ఆండీ ప్లవర్ (Andy Flower) మాట్లాడాడు. 

‘‘ఇది స్పష్టంగా మాకు నాకౌట్ స్టేజ్‌. ప్రతీ మ్యాచ్‌ ఇప్పుడు మాకు సెమీఫైనల్ లాంటిది. కానీ, ఇప్పుడు మేం బలంగా తిరిగి రావడంపై దృష్టిపెట్టాం. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌ మాకు నిజంగా చాలా కఠినమైనది. వారు గొప్పగా ఆడి భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. బహుశా అదే మా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. మిడిలార్డర్‌లో మా జట్టు బ్యాట్‌తో పోరాడినందుకు నేను నిజంగా గర్వపడుతున్నాను. మేం మ్యాచ్‌లో ఓడిపోయాం. కానీ, మా జట్టు పోరాడిన తీరు నిజంగా గర్వంగా ఉంది’’ అని ఆండీ ప్లవర్‌ పేర్కొన్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని