Chappell Advice to Bumrah: బుమ్రా.. నీకు నాదొక సలహా: చాపెల్‌

దాదాపు సంవత్సరం తర్వాత కీలకమైన టోర్నీలకు ముందు జట్టులోకి వచ్చిన బుమ్రా (Bumrah) ప్రదర్శనపైనే చర్చ సాగుతోంది. ఐర్లాండ్‌తో సిరీస్‌లో (IRE vs IND) భాగంగా తొలి మ్యాచ్‌లో ఉత్తమ ప్రదర్శనే చేశాడు. నేడు రెండో టీ20 మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో బుమ్రాకి గ్రెగ్ చాపెల్‌ పలు సూచనలు చేశాడు.

Updated : 20 Aug 2023 13:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దాదాపు సంవత్సరం తర్వాత మైదానంలోకి టీమ్‌ఇండియా స్టార్‌ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Bumrah) అడుగుపెట్టాడు ఐర్లాండ్‌పై నాలుగు ఓవర్ల కోటా వేసి రెండు వికెట్లు పడగొట్టాడు. గతంతో పోలిస్తే బౌలింగ్ శైలిలో కాస్త మార్పు చేసుకోవడం గమనార్హం. అయినా తన రిథమ్‌ను దొరకబుచ్చుకోవడంతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇవాళ రెండో టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఈ క్రమంలో బుమ్రాకి టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ గ్రెగ్ చాపెల్ కీలక సూచనలు చేశాడు. స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆటతీరును ఉదహరిస్తూ.. బుమ్రా కూడా అలాగే ఆడాలని చెప్పాడు.

వరుస రోజుల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తే సెక్యూరిటీ కష్టమే..

‘‘విరాట్ కోహ్లీ కూడా గతంలో ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు. ఒక్కసారి ఫామ్‌లోకి వచ్చాక మాత్రం అదరగొట్టేస్తున్నాడు. అతడి ఆటతీరునే బుమ్రా కూడా అనుసరించాలి. గత సంవత్సరం నుంచి మైదానంలోకి దిగకపోయేసరికి బుమ్రా మైండ్‌సెట్‌ కాస్త అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంది. దాన్ని క్రమ పద్ధతిలో సరిచేసుకోవాలి. అందుకోసం ప్రత్యేకంగా కొన్ని విషయాలను పాటించాలి. ఒక్కసారి ఒక బంతి గురించి మాత్రమే ఆలోచించాలి. ఉదాహరణకు బౌలింగ్‌ చేసేటప్పుడు మొదటి బాల్‌ బౌండరీకి వెళ్లినా.. అక్కడితో వదిలేయాలి. తర్వాతి బంతి గురించే ఆలోచించాలి. అప్పుడే బౌలింగ్‌పై నియంత్రణ తెచ్చుకోవడానికి ఆస్కారముంటుంది.  

గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేయడం చాలా కష్టం. మానసికంగా సిద్ధం కావాలి. అప్పుడే నాణ్యమైన ప్రదర్శన ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. మనసును తేలికగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. అనవసర ఒత్తిడి పెట్టుకోకుండా బౌలింగ్‌ చేయాలి. అప్పుడే ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌ టోర్నీల్లో భారత్‌కు కలిసొస్తుంది’’ అని చాపెల్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని