ODI WC 2023 in UPPAL Stadium: వరుస రోజుల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తే సెక్యూరిటీ కష్టమే.. HYD పోలీసుల ఆందోళన!

వన్డే వరల్డ్‌ కప్‌ (ODi World Cup 2023) సమీపస్తున్న కొద్దీ ఆయా సంఘాల నుంచి విజ్ఞప్తులు వస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌ వేదికగా జరగనున్న పాక్-శ్రీలంక మ్యాచ్‌ షెడ్యూల్‌ను మార్చాలని బీసీసీఐని హెచ్‌సీఏ కోరుతోంది.

Updated : 20 Aug 2023 13:08 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని జట్లూ సిద్ధమవుతున్నాయి. కొన్ని టీమ్‌లు తమ ప్రాథమిక జట్లనూ ప్రకటించాయి. ఐసీసీ, బీసీసీఐ (BCCI) కూడా మ్యాచ్‌ల రీషెడ్యూల్‌ను ఖరారు చేసేశాయి.  ఉప్పల్‌ వేదికగా మూడు వరల్డ్ కప్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో భారత్ ఆడే మ్యాచ్‌లు లేవు. అక్టోబర్‌ 6న  పాకిస్థాన్ - నెదర్లాండ్స్‌, అక్టోబర్ 9న న్యూజిలాండ్ - నెదర్లాండ్స్‌, అక్టోబర్ 10న పాకిస్థాన్ - శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్‌లు ఉన్నాయి. అయితే.. వరుస రోజుల్లో మ్యాచ్‌లపై హైదరాబాద్‌ పోలీసులు (Hyderabad Police) భద్రతాపరమైన ఆందోళనను వ్యక్తం చేయగా.. బీసీసీఐ దృష్టికి ‘హైదరాబాద్ క్రికెట్‌ సంఘం’ (HCA) ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

పారిస్‌ ఒలింపిక్స్‌ నిర్వాహకులకు ఎదురు దెబ్బ

వరుస రోజుల్లో రెండు మ్యాచులను నిర్వహించడం, సెక్యూరిటీని కల్పించడం ఇబ్బందిగా మారుతుందని హైదరాబాద్‌ పోలీస్‌ విభాగం ఆందోళన వ్యక్తం చేసింది. తొలి షెడ్యూల్‌ ప్రకారం పాకిస్థాన్ - శ్రీలంక మ్యాచ్‌ అక్టోబర్ 12న జరగాల్సింది. కానీ, అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న భారత్ - పాక్‌ మ్యాచ్‌ను అక్టోబర్ 14కి రీషెడ్యూల్‌ చేశారు. దీంతో పాకిస్థాన్‌కు తగినంత సమయం ఇవ్వడానికి లంకతో జరగాల్సిన మ్యాచ్‌ను అక్టోబర్ 10కి మార్చారు. అలాగే కోల్‌కతా వేదికగా జరగనున్న పాక్‌ - ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ కూడా నవంబర్ 12కి బదులు నవంబర్‌ 11న నిర్వహించేలా రీషెడ్యూల్‌ చేశారు. దీంతో హైదరాబాద్‌ పోలీసులు, హెచ్‌సీఏ విజ్ఞప్తిపై బీసీసీఐ, ఐసీసీ ఏ విధంగా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.

అక్టోబర్ 8న భారత్ తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా తలపడనుంది. ఇప్పటికే వరల్డ్‌ కప్‌ మ్యాచుల టికెట్ల విక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 25 నుంచి అధికారికంగా విక్రయాలు జరగనున్నాయి. తొలిసారి భారత్‌ పూర్తిస్థాయి టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. దేశవ్యాప్తంగా పది వేదికల్లో వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లను నిర్వహించనుండటం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని