IND vs PAK match ODI WC 2023: గంటలోపే టికెట్ల విక్రయం.. ఇలాంటి డ్రామాలు ఆడొద్దంటున్న ఫ్యాన్స్‌!

దాయాదుల పోరును (IND vs PAK) చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపడం సహజం. వరల్డ్‌ కప్‌లో (ODI World Cup 2023) అహ్మదాబాద్‌ వేదికగా మ్యాచ్‌ జరగనుంది. అయితే, టికెట్ల విక్రయాల సందర్భగా ఫ్యాన్స్‌ నుంచి బీసీసీఐ, ఐసీసీ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 

Updated : 30 Aug 2023 12:02 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్‌లో భారత్ - పాకిస్థాన్‌ (IND vs PAK) మ్యాచ్ అక్టోబర్ 14న జరగనుంది. ఆ మ్యాచ్‌కు సంబంధించి కొన్ని టికెట్లను మంగళవారం సాయంత్రం ఆన్‌లైన్‌లో ఉంచారు. కేవలం గంట వ్యవధిలోనే సోల్డ్‌ ఔట్‌ అని సందేశం కనిపించడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే, కొన్ని టికెట్లను మాత్రమే అందుబాటులో ఉంచామని, సెప్టెంబర్‌ 3న మరో సేల్‌ ఉంటుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఇప్పుడు ఎన్ని టికెట్లను అందుబాటులో ఉంచారో బయటకు చెప్పాలని క్రికెట్ ఫ్యాన్స్‌ డిమాండ్ చేస్తున్నారు. టికెట్ల కోసం ఆన్‌లైన్‌ క్యూలోకి వచ్చినప్పటికీ.. టికెట్‌ జారీకి నాలుగు గంటల నుంచి నాలుగు నెలల అంచనా సమయం ఇవ్వడంతో ట్రోలర్స్‌ తమ కామెంట్లకు పదునుపెట్టారు. 

ఒకసారి భారత్‌.. మరోసారి పాక్‌ లేకుండా ఆసియా కప్.. ఎందుకో తెలుసా?

‘‘ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్‌ బోర్డు అయిన బీసీసీఐ ఏర్పాటు చేయించిన టికెట్‌ బుకింగ్‌ సిస్టమ్‌ ఇలా ఉంది. దాదాపు రెండు గంటలపాటు వేచి ఉన్నా.. బుక్‌మై షోలో టికెట్‌ మాత్రం దొరకలేదు’’

‘‘టికెట్ల లైన్‌లోకి అనుమతించిన బుక్‌మైషో.. టికెట్ ఇవ్వడానికి మాత్రం నాలుగు నెలల కంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. నేను అప్పుడు మ్యాచ్‌ హైలైట్స్‌ను చూడాలా..?’’

‘‘ఇదొక స్కాం. ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ కోసం ఇంతటి చెత్త టికెట్‌ బుకింగ్‌ సిస్టమ్‌ను ఎంపిక చేశారు. భారత్‌ మ్యాచ్‌లకు సంబంధించి ఒక్క టికెట్‌ కూడా బుక్‌ చేసుకోలేకపోయా’’

‘‘టికెట్‌ బుకింగ్‌లో నాకెదురైన అత్యంత చెత్త అనుభవం ఇదే. ఈ వీడియోను చూస్తే మీకే అర్థమవుతుంది. మీరు టికెట్లను విక్రయించకూడదని నిర్ణయించుకుంటే ఇలాంటి డ్రామాలు చేయకుండా ఉండండి. మా భావోద్వేగాలతో ఆడుకోవడం దారుణం’’ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని