Sourav Ganguly: చోరీకి గురైన గంగూలీ ఫోన్.. దానిలోని డేటాపై ఆందోళన!

టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ ఫోన్‌ చోరీకి గురైంది. అందులో వ్యక్తిగత సమాచారం, కీలక డేటా ఉండడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Published : 11 Feb 2024 14:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ ఇండియా మాజీ సారథి సౌరభ్‌ గంగూలీ (Sourav Ganguly) ఫోన్‌ చోరీకి గురైంది. కోల్‌కతాలోని ఆయన నివాసంలో ఈ ఘటన చోటు చేసుకొంది.  దీంతో ఫోన్‌లోని వ్యక్తిగత డేటా భద్రతపై ఆయన ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..

సౌరభ్‌ గంగూలీ బెహలాలోని తన నివాసానికి ప్రస్తుతం పెయింటింగ్‌ పని చేయిస్తున్నారు. తన ఫోన్‌ను ఇంట్లో పెట్టి బయటకు వెళ్లారు. ఆయన తిరిగి వచ్చే సరికి అది మాయమైంది. ఇల్లంతా గాలించినా ఎక్కడా కనిపించలేదు. దీంతో వెంటనే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ ఫోన్‌లో తన వ్యక్తిగత సమాచారం, ఇతర కీలక డేటా ఉండడంతో ఆందోళన వ్యక్తం చేశారు. అది దుర్వినియోగం కాకుండా త్వరగా ఫోన్‌ను రికవరీ చేయాలని కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో పని చేస్తున్న వారిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని