Gautam Gambhir: వారెవరూ కాదు.. అతడే నిస్వార్థమైన ఆటగాడు: గౌతమ్‌ గంభీర్

గౌతమ్‌ గంభీర్‌ ఏం అంశంపైనైనా సూటిగా మాట్లాడేస్తాడు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలోనూ నిస్వార్థ ఆటగాడిగా ఎవరిని ఎంచుకుంటారనే ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు.

Published : 20 Mar 2024 14:59 IST

ఇంటర్నెట్ డెస్క్‌: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR) ఫ్రాంచైజీకి మెంటార్‌గా తన బాధ్యతలను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు ప్రయత్నిస్తానని గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) తెలిపాడు. కేకేఆర్‌ అభిమానులను నిరాశకు గురి చేయమన్నాడు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ‘ప్లేయర్ ఆఫ్ ది టీమ్’ అంశంపై సూటిగా బదులిచ్చాడు. ఎంఎస్ ధోనీ, సచిన్, విరాట్, రోహిత్‌.. ఇలా ఎవరి పేరునైనా చెబుతాడనుకుంటే.. ఆశ్చర్యకరంగా నెదర్లాండ్స్‌ మాజీ క్రికెటర్‌ను ఎంపిక చేయడం విశేషం. 

‘‘ఇప్పటివరకు నేను ఎప్పుడూ జట్టు కోసం నిస్వార్థంగా ఆడిన ప్లేయర్‌ ఎవరు అనే విషయాలపై మాట్లాడలేదు. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తున్నా. ఇప్పటివరకు నేను ఆడిన, కలిసి పని చేస్తున్న ఆటగాళ్లలో చాలామందిని చూశా. కానీ, అందరికంటే నిస్వార్థమైన, మానవత్వం కలిగిన ఒకేఒక్క ప్లేయర్ ఉన్నాడు. కేకేఆర్‌ కెప్టెన్‌గా 2011లో ఆడినప్పుడు మా జట్టులో కేవలం నలుగురు ఓవర్సీస్‌ ప్లేయర్లు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పే ఆటగాడు 50 ఓవర్ల వరల్డ్‌కప్‌లో అద్భుతంగా ఆడాడు. కానీ, మేం ఆ సీజన్‌లోని ఓ మ్యాచ్‌లో ముగ్గురు విదేశీ ఆటగాళ్లతోనే ఆడాం. అతడు మాత్రం డగౌట్‌కే పరిమితం కావాల్సివచ్చింది. కానీ, ఏమాత్రం నిరుత్సాహానికి గురికాకుండా డ్రింక్స్‌ను అందించాడు. నిస్వార్థమనేది నాకు అతడు నేర్పాడు. అతడే ర్యాన్‌ టెన్ డోస్చటే. ఇలాంటివారే స్ఫూర్తిదాయకం. అలాగే నేను కోల్‌కతాను విజయవంతంగా నడపడం కాదు.. నన్నే కేకేఆర్ సక్సెస్‌ఫుల్‌ లీడర్‌ను చేసింది’’ అని గంభీర్‌ వ్యాఖ్యానించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని