8 జట్లతోనే వచ్చే ఐపీఎల్‌!

చ్చే ఏడాది ఐపీఎల్‌ను 8 జట్లతోనే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. 2021 ఐపీఎల్‌కు మూడున్నర నెలల సమయమే ఉండటంతో కొత్త జట్లను చేర్చడం హడావుడి నిర్ణయమే అవుతుందని బీసీసీఐ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. కొత్తగా చేర్చే ఒకటి లేదా రెండు జట్లను 2022 నుంచి ఆడించాలని నిర్ణయించింది.

Updated : 29 Feb 2024 13:34 IST

ముంబయి: వచ్చే ఏడాది ఐపీఎల్‌ను 8 జట్లతోనే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. 2021 ఐపీఎల్‌కు మూడున్నర నెలల సమయమే ఉండటంతో కొత్త జట్లను చేర్చడం హడావుడి నిర్ణయమే అవుతుందని బీసీసీఐ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. కొత్తగా చేర్చే ఒకటి లేదా రెండు జట్లను 2022 నుంచి ఆడించాలని నిర్ణయించింది. ఈనెల 24న అహ్మదాబాద్‌లో జరిగే వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఈ ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలపనుంది. మూడు వారాల క్రితం బీసీసీఐ ఇచ్చిన ఏజీఎం నోటీసు అజెండాలో రెండు కొత్త జట్ల ఎంపికను చేర్చింది. ఈ ప్రతిపాదనకు ఏజీఎం ఆమోదం తెలిపినా వెంటనే టెండర్లు ఆహ్వానించొద్దని బోర్డు భావిస్తోంది. ‘‘కొత్త ఫ్రాంచైజీల కోసం ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ లేదా సరైన సమయం అనుకున్నప్పుడు బీసీసీఐ టెండర్లు పిలవొచ్చు. 2021 ఐపీఎల్‌లోనే కొత్త జట్లను చేర్చితే నిర్వహణ కష్టమవుతుంది’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

ఇవీ చదవండి..

వీళ్లేం క్రికెట్‌ పాలకులు?

36/9 ఊహించలేదు: బుద్ధిని వాడాలి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని