నిఖత్‌కు మహీంద్రా థార్‌

వరుసగా రెండో ఏడాదీ ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌గా నిలిచిన తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌కు మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థ తమ కారు ‘థార్‌’ను అందించింది.

Updated : 28 Mar 2023 04:13 IST

దిల్లీ: వరుసగా రెండో ఏడాదీ ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌గా నిలిచిన తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌కు మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థ తమ కారు ‘థార్‌’ను అందించింది. ఈ సారి ఛాంపియన్‌షిప్స్‌లో 50 కేజీల విభాగంలో విశ్వవిజేతగా నిలిచిన నిఖత్‌.. ‘మహీంద్రా ఎమర్జింగ్‌ బాక్సింగ్‌ ఐకాన్‌’ అవార్డునూ గెలుచుకుంది. ‘‘ఎదురన్నదే లేని నిఖత్‌ భారత క్రీడా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. మహీంద్రా ఎమర్జింగ్‌ బాక్సింగ్‌ ఐకాన్‌గా నిలిచిన ఆమెకు అభినందనలు. ఆమె అద్భుతమైన ఘనతలకు గాను కొత్త థార్‌ కారును అందిస్తున్నాం’’ అని మహీంద్రా ఆటోమోటివ్‌ ట్వీట్‌ చేసింది. ఛాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకంతో పాటు సుమారు రూ.82 లక్షల నగదు బహుమతి కూడా నిఖత్‌ ఖాతాలో చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని