MS Dhoni: విజయవంతంగా ధోని మోకాలికి శస్త్రచికిత్స
ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను అయిదోసారి విజేతగా నిలబెట్టిన కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని మోకాలికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది.
దిల్లీ: ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను అయిదోసారి విజేతగా నిలబెట్టిన కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని మోకాలికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ముంబయిలో ప్రముఖ వైద్యుడు, బీసీసీఐ వైద్య ప్యానల్ సభ్యుడైన దిన్షా పర్దీవాలా నేతృత్వంలో గురువారం ఈ ఆపరేషన్‌ను నిర్వహించారు. ‘‘ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో ధోని మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. ఒకటి రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి బయటకు వస్తాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ వరకు కోలుకోవడానికి అతడికి చాలా సమయం ఉంది’’ అని సీఎస్కే మేనేజ్‌మెంట్ చెప్పింది. ఈ ఐపీఎల్ సీజన్లో మోకాలికి భారీ బ్యాండేజ్ వేసుకునే ధోని దాదాపు అన్ని మ్యాచ్‌లు ఆడాడు. కీపింగ్‌లో సమస్య లేకపోయినా.. బ్యాటింగ్‌లో వికెట్ల మధ్య పరుగెత్తడానికి ఇబ్బందిపడ్డాడు. శరీరం సహకరిస్తే మరో సీజన్ ఆడతానని.. కొన్ని నెలల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటానని ఐపీఎల్ ఫైనల్ అనంతరం మహి చెప్పిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
King Of Kotha OTT Release: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త చిత్రం.. ఆ విషయంలో నో క్లారిటీ..!
-
Demat accounts: ఊరిస్తున్న మార్కెట్లు.. పెరిగిన డీమ్యాట్ ఖాతాలు
-
Rathod Bapu Rao: భారాసకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా: రాథోడ్ బాపూరావు
-
Lokesh: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దౌర్జన్యం.. నిలదీస్తే నిర్బంధం..: లోకేశ్
-
Sri Lanka: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్టయిన శ్రీలంక మాజీ క్రికెటర్‌కు బెయిల్
-
పిల్లలతో కలిసి మా సినిమా చూడొద్దు: స్టార్ హీరో