David Warner: శ్రీవల్లి పాటకు వార్నర్‌ స్టెప్పులు

ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఆటతోనే కాదు మైదానంలో తన ఉనికితోనూ అభిమానులను అలరిస్తూనే ఉంటాడు. క్రీజులో ఉన్నప్పుడు, బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు వివిధ హావాభావాలు ప్రదర్శిస్తూ, హీరోలను అనుకరిస్తూ ఉత్సాహంగా గడుపుతాడు.

Updated : 29 Oct 2023 08:40 IST

ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఆటతోనే కాదు మైదానంలో తన ఉనికితోనూ అభిమానులను అలరిస్తూనే ఉంటాడు. క్రీజులో ఉన్నప్పుడు, బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు వివిధ హావాభావాలు ప్రదర్శిస్తూ, హీరోలను అనుకరిస్తూ ఉత్సాహంగా గడుపుతాడు. ఇప్పుడు కివీస్‌తో మ్యాచ్‌లోనూ ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో ‘పుష్ప’ సినిమాలోని ‘శ్రీవల్లి’ పాటకు వార్నర్‌ స్టెప్పులేశాడు. ఈ టోర్నీలో సెంచరీ చేయగానే తగ్గేదేలే అంటూ సంజ్ఞ చేస్తున్న వార్నర్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌ లాగే నృత్యం చేశాడు. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని