Shreyas - Hardik: హార్దిక్‌ వస్తే అయ్యర్‌కు ఖో?

ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య గైర్హాజరీలో మిడిల్డార్‌లో చోటు దక్కించుకున్న సూర్యకుమార్‌ యాదవ్‌ ఆదివారం ఇంగ్లాండ్‌పై చక్కటి ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.

Updated : 31 Oct 2023 07:50 IST

దిల్లీ: ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య(Hardik Pandya) గైర్హాజరీలో మిడిల్డార్‌లో చోటు దక్కించుకున్న సూర్యకుమార్‌ యాదవ్‌ ఆదివారం ఇంగ్లాండ్‌పై చక్కటి ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. క్లిష్ట పరిస్థితుల్లో 47 బంతుల్లో 49 పరుగులు రాబట్టి ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే సూర్య ఇన్నింగ్స్‌ భారత జట్టుకు కొత్త సమస్య తెచ్చిపెట్టింది! గాయంతో ఆటకు దూరమైన హార్దిక్‌ లీగ్‌ దశ చివర్లో జట్టుకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అదే జరిగితే తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. విశ్లేషకుల అంచనాల ప్రకారం మిడిల్డార్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌(Shreyas Iyer) స్థానానికి ప్రమాదం పొంచి ఉంది. ప్రపంచకప్‌లో పెద్దగా ఫామ్‌లో లేని అయ్యర్‌కు హార్దిక్‌ ఖో చెప్పే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అయ్యర్‌ 6 మ్యాచ్‌ల్లో 33.50 సగటుతో 134 పరుగులు సాధించాడు. రెండు మ్యాచ్‌లాడిన సూర్య.. ఇంగ్లాండ్‌తో ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. గురువారం ముంబయిలో శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లోనూ సత్తాచాటితే జట్టులో సూర్య స్థానం సుస్థిరమైనట్లే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని