Shreyas Iyer: ఆ సమస్యను అధిగమించాలని..

షార్ట్‌ బంతిని ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతోన్న టీమ్‌ఇండియా బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఆ బలహీనతను అధిగమించడంపై దృష్టిపెట్టాడు. గురువారం శ్రీలంకతో మ్యాచ్‌ నేపథ్యంలో నెట్స్‌లో షార్ట్‌ బంతులను ప్రాక్టీస్‌ చేశాడు.

Updated : 01 Nov 2023 05:13 IST

ముంబయి: షార్ట్‌ బంతిని ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతోన్న టీమ్‌ఇండియా బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఆ బలహీనతను అధిగమించడంపై దృష్టిపెట్టాడు. గురువారం శ్రీలంకతో మ్యాచ్‌ నేపథ్యంలో నెట్స్‌లో షార్ట్‌ బంతులను ప్రాక్టీస్‌ చేశాడు. త్రోడౌన్‌ స్పెషలిస్టులు రాఘవేంద్ర, నువాన్‌ సెనివిరత్నె దాదాపు రెండు గంటలపాటు శ్రేయస్‌కు షార్ట్‌ బాల్స్‌ వేశారు. అతడు పుల్‌ షాట్లు, హుక్‌ షాట్లు ఆడాడు. బంతులను చాలా వరకు బౌండరీ దాటించడమో, స్టాండ్స్‌లోకి కొట్టడమో చేశాడు. ప్రాక్టీస్‌ సెషన్‌ ఆఖర్లో టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కూడా శ్రేయస్‌కు బంతులు విసిరాడు. బౌలింగ్‌ కోచ్‌ పరాస్‌ మాంబ్రే దూరం నుంచి శ్రేయస్‌ బ్యాటింగ్‌ను చూశాడు. అయ్యర్‌ న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌లతో మ్యాచ్‌లలో షార్ట్‌ బంతులకు ఔటైన సంగతి తెలిసిందే. మరోవైపు ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ కూడా నెట్స్‌లో సుదీర్ఘంగా బ్యాటింగ్‌ సాధన చేశాడు. అశ్విన్‌, జడేజా బౌలింగ్‌ కన్నా బ్యాటింగే ఎక్కువ ప్రాక్టీస్‌ చేశారు. టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు రోహిత్‌, కోహ్లి, శుభ్‌మన్‌ గిల్‌ సాధనకు దూరంగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని