Trent Boult: భారత్‌తో సెమీస్‌ పెద్ద సవాల్‌: బౌల్ట్‌

భారత్‌తో ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ పెద్ద సవాల్‌గా నిలవబోతుందని న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ అన్నాడు. ‘‘భారత్‌ ప్రస్తుతం సానుకూలంగా ఆడుతోంది. ప్రపంచకప్‌ సెమీస్‌లో ఎలా ఆ జట్టును ఎదుర్కోవాలో స్పష్టమైన అవగాహనతో ఉన్నాం. కచ్చితంగా భారత్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌ అందరిలో ఉత్కంఠ రేపబోతోంది.

Updated : 10 Nov 2023 08:01 IST

బెంగళూరు: భారత్‌తో ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ పెద్ద సవాల్‌గా నిలవబోతుందని న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌(Trent Boult) అన్నాడు. ‘‘భారత్‌ ప్రస్తుతం సానుకూలంగా ఆడుతోంది. ప్రపంచకప్‌ సెమీస్‌లో ఎలా ఆ జట్టును ఎదుర్కోవాలో స్పష్టమైన అవగాహనతో ఉన్నాం. కచ్చితంగా భారత్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌ అందరిలో ఉత్కంఠ రేపబోతోంది. గతంలో టీమ్‌ఇండియాతో చాలాసార్లు తలపడ్డాం. కానీ ఈసారి కోట్లాది మంది అభిమానుల మద్దతుతో సొంతగడ్డపై నాకౌట్‌ మ్యాచ్‌ ఆడబోతున్న భారత్‌ను ఎదుర్కోవడం పెద్ద సవాల్‌. తిరుగులేని ఫామ్‌లో ఉన్న జట్టును ఆపడం అంత తేలికేం కాదు’’ అని బౌల్ట్‌ చెప్పాడు. 2019 ప్రపంచకప్‌లోనూ భారత్‌-న్యూజిలాండ్‌ జట్లు సెమీఫైనల్లో ఢీకొన్నాయి. అప్పుడు కివీస్‌ గెలిచింది.


భారత్‌ను నెదర్లాండ్స్‌ ఓడించొచ్చు

పుణె: క్రికెట్లో ఎన్నో చిత్రమైన సంఘటనలు జరిగాయని.. అలాగే భారత్‌పై నెదర్లాండ్స్‌ గెలవొచ్చని ఆ జట్టు ఆల్‌రౌండర్‌ తేజ నిడమానూరు ఆశాభావం వ్యక్తంజేశాడు. ‘‘ఇది క్రికెట్‌. ఏదైనా సాధ్యమే (భారత్‌ను ఓడించడం). మా శైలిలో ఆడతాం. మేం బాగా చేయగలిగిందే చేస్తాం. బంతితో రాణించేందుకు మా దగ్గర కొన్ని ఎత్తుగడలు ఉన్నాయి. స్పిన్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఆడగల ఆటగాళ్లూ ఉన్నారు. కొంచెం అదృష్టం కూడా తోడవ్వాలి. భారత్‌ బలమైన జట్టు అనడంలో సందేహం లేదు. వాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. కాని క్రికెట్లో చిత్రమైన సంఘటనలు జరిగాయి’’ అని తేజ వివరించాడు. ఆదివారం బెంగళూరులో జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌తో నెదర్లాండ్స్‌ తలపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని