David Warner: వార్నర్‌కు విశ్రాంతి

Eenadu icon
By Sports News Desk Updated : 22 Nov 2023 07:20 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మెల్‌బోర్న్‌: భారత్‌తో అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు వార్నర్‌కు విశ్రాంతినిచ్చారు. ప్రపంచకప్‌లో 535 పరుగులతో ఆసీస్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచిన వార్నర్‌(David Warner).. ఇంతకుముందు ఆసీస్‌ సెలక్షన్‌ కమిటీ ప్రకటించిన జట్టులో ఉన్నాడు. తాజాగా వార్నర్‌ స్థానంలో ఆల్‌రౌండర్‌ ఆరోన్‌ హార్డీని ఎంపిక చేశారు. ‘‘వార్నర్‌ను స్వదేశానికి పంపాలని సెలక్టర్లు నిర్ణయించారు’’ అని క్రికెట్‌ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో తెలిపింది. సొంతగడ్డపై పాక్‌తో జరిగే టెస్టు సిరీసే తన టెస్టు కెరీర్‌లో చివరిదని ఇంతకుముందు సూచనప్రాయంగా చెప్పిన వార్నర్‌.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశాడు. వార్నర్‌ తన చివరి వన్డే ఆడేశాడని పేర్కొన్న ఓ సోషల్‌ మీడియా పోస్ట్‌కు తాజాగా అతడు స్పందిస్తూ.. ‘‘నా పనైపోయిందన్నది ఎవరు?’’ అని అన్నాడు. ప్రపంచకప్‌ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులోని ఏడుగురు ఆటగాళ్లు మాత్రమే భారత్‌తో టీ20 సిరీస్‌లో ఆడనున్నారు. వాళ్లు.. సీన్‌ అబాట్‌, హెడ్‌, ఇంగ్లిస్‌, మ్యాక్స్‌వెల్‌, స్మిత్‌, స్టాయినిస్‌, జంపా.

ఆస్ట్రేలియా జట్టు: వేడ్‌ (కెప్టెన్‌), ఆరోన్‌ హార్డీ, బెరెన్‌డార్ఫ్‌, సీన్‌ అబాట్‌, టిమ్‌ డేవిడ్‌, నాథన్‌ ఎలిస్‌, హెడ్‌, జోష్‌ ఇంగ్లిస్‌, మ్యాక్స్‌వెల్‌, తన్వీర్‌ సంఘా, షార్ట్‌, స్టీవ్‌ స్మిత్‌, స్టాయినిస్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌, జంపా.

Tags :
Published : 22 Nov 2023 04:34 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు