IND Vs AUS: మ్యాచ్‌లో ఓ మలుపు.. ఇషాన్‌ కిషన్‌ తప్పిదమే ఆసీస్‌కు కలిసొచ్చింది!

వికెట్‌కీపర్‌ ఇషాన్‌కిషన్‌ చేసిన ఓ తప్పిదం ఆసీస్‌కు కలిసొచ్చింది. ఆ జట్టు 9 బంతుల్లో 33 పరుగులు చేయాల్సిన సమయంలో.. అక్షర్‌ పటేల్‌ వేసిన 19వ ఓవర్లో నాలుగో బంతిని మాథ్యూ వేడ్‌ కాస్త ముందుకు వచ్చి ఆడబోయాడు.

Updated : 29 Nov 2023 12:20 IST

వికెట్‌కీపర్‌ ఇషాన్‌కిషన్‌ చేసిన ఓ తప్పిదం ఆసీస్‌కు కలిసొచ్చింది. ఆ జట్టు 9 బంతుల్లో 33 పరుగులు చేయాల్సిన సమయంలో.. అక్షర్‌ పటేల్‌ వేసిన 19వ ఓవర్లో నాలుగో బంతిని మాథ్యూ వేడ్‌ కాస్త ముందుకు వచ్చి ఆడబోయాడు. బంతిని దొరకబుచ్చుకున్న ఇషాన్‌ స్టంపింగ్‌ చేసి అప్పీల్‌ చేశాడు. రిప్లేలో వేడ్‌ నాటౌట్‌గా తేలాడు. అయితే బంతిని అందుకునే క్రమంలో ఇషాన్‌ గ్లోవ్స్‌ స్టంప్స్‌ కన్నా ముందుకు రావడంతో అంపైర్‌ ఈ బంతిని నోబాల్‌గా ప్రకటించాడు. ఫ్రీహిట్‌ను సద్వినియోగం చేసుకుంటూ వేడ్‌ సిక్స్‌ కొట్టాడు. అదే ఓవర్‌ ఆఖరి బంతికి బైస్‌ రూపంలో నాలుగు పరుగులు లభించాయి. చివరి ఓవర్లో 21 పరుగులు చేయాల్సిరాగా.. మ్యాక్స్‌వెల్‌ బాదేశాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం బౌలర్‌ బంతి వేసిన తర్వాత వికెట్‌కీపర్‌ స్టంప్స్‌ వెనకాలే బంతిని అందుకోవాలి. గ్లవ్‌లో కొంచెం భాగం ముందుకు వచ్చినా దాన్ని అంపైర్‌ నోబాల్‌గా ప్రకటించొచ్చు. ఇషాన్‌ అప్పీల్‌ చేయకపోతే.. ఫ్రీహిట్‌ అవకాశం వేడ్‌కు వచ్చేదే కాదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని