Pro Kabaddi League: కూతకు వేళాయె.. నేటి నుంచే ప్రొ కబడ్డీ సీజన్‌-10

పాదరసంలా కదులుతూ పాయింట్లు కొల్లగొట్టేవాళ్లు ఒకరు... చిరుతలా మీదపడి ప్రత్యర్థిని ఒడిపట్టేవాళ్లు ఇంకొకరు.. ఎంతమంది చుట్టేసినా బయటకి జారిపోయే డుబ్కీ కింగ్‌ మరొకరు! వీరంతా ఆడేది ఒకే వేదికలో! 12 జట్లు పోరాడేది ఒకే కప్‌ కోసం!

Updated : 02 Dec 2023 09:07 IST

పాదరసంలా కదులుతూ పాయింట్లు కొల్లగొట్టేవాళ్లు ఒకరు... చిరుతలా మీదపడి ప్రత్యర్థిని ఒడిపట్టేవాళ్లు ఇంకొకరు.. ఎంతమంది చుట్టేసినా బయటకి జారిపోయే డుబ్కీ కింగ్‌ మరొకరు! వీరంతా ఆడేది ఒకే వేదికలో! 12 జట్లు పోరాడేది ఒకే కప్‌ కోసం! మొదలుకాబోతోంది ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-10 (Pro Kabaddi League)! గత తొమ్మిదేళ్లుగా అశేష అభిమానులను అలరించిన ఈ లీగ్‌ శనివారం నుంచి మరో సీజన్‌కు సిద్ధమైంది. ఇక అభిమానులకు పండగే! అహ్మదాబాద్‌లో తెలుగు టైటాన్స్‌-గుజరాత్‌ జెయింట్స్‌తో టోర్నీ మొదలు కానుంది.

పదో లీగ్‌

2014లో ప్రారంభమైన ప్రొ కబడ్డీ లీగ్‌ ఇప్పటిదాకా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకుంది. జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌ (2014, 2022), యు ముంబా (2015), పట్నా పైరేట్స్‌ (2016-ఫిబ్రవరి, 2016-జులై, 2017), బెంగళూరు బుల్స్‌ (2018), బెంగాల్‌ వారియర్స్‌ (2019), దబాంగ్‌ దిల్లీ (2021) ఇప్పటివరకు విజేతలుగా నిలిచాయి.


బరిలో 12 జట్లు

తెలుగు టైటాన్స్‌, తమిళ్‌ తలైవాస్‌, పుణెరి పల్టాన్‌, పట్నా పైరేట్స్‌, జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌, హరియాణా స్టీలర్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌, దబాంగ్‌ దిల్లీ, బెంగళూరు బుల్స్‌, బెంగాల్‌ వారియర్స్‌, యూపీ యోధ, యు ముంబా కప్పు వేటలో ఉన్నాయి.


హైదరాబాద్‌లో ఎప్పుడు

డిసెంబర్‌ 2న మొదలయ్యే ఈ టోర్నీలో లీగ్‌ దశలో మొత్తం 132 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లు 2024 ఫిబ్రవరి 21న ముగుస్తాయి. ప్లేఆఫ్స్‌, ఫైనల్‌ తేదీలు తర్వాత ప్రకటిస్తారు. హైదరాబాద్‌ వేదికగా గచ్చిబౌలి స్టేడియంలో జనవరి 19 నుంచి 24 వరకు 11 మ్యాచ్‌లు జరుగుతాయి. వీటిలో తెలుగు టైటాన్స్‌ నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది. స్టార్‌స్పోర్ట్స్‌, డీస్నీ హాట్‌ స్టార్‌లలో మ్యాచ్‌లను వీక్షించొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని