ఒక్క రోజే 15 వికెట్లు

బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌ మధ్య రెండో టెస్టులో స్పిన్నర్లు వికెట్ల పండగ చేసుకుంటున్నారు. బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల స్పిన్నర్ల మాయాజాలంతో ఒక్కరోజే 15 వికెట్లు నేలకూలాయి.

Published : 07 Dec 2023 02:41 IST

బంగ్లాదేశ్‌ 172 ఆలౌట్‌.. కివీస్‌ 55/5

మిర్పూర్‌: బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌ మధ్య రెండో టెస్టులో స్పిన్నర్లు వికెట్ల పండగ చేసుకుంటున్నారు. బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల స్పిన్నర్ల మాయాజాలంతో ఒక్కరోజే 15 వికెట్లు నేలకూలాయి. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 66.2 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌటైంది. ముష్ఫికర్‌ రహీం (35) అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. కివీస్‌ స్పిన్నర్లు అజాజ్‌ పటేల్‌ (2/54)), మిచెల్‌ శాంట్నర్‌ (3/65), గ్లెన్‌ ఫిలిప్స్‌ (3/31).. పేసర్‌ టిమ్‌ సౌథీ (1/5) వికెట్లను పంచుకున్నారు. ఆ తర్వాత న్యూజిలాండ్‌ బ్యాటర్లు స్పిన్‌కు దాసోహమన్నారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 12.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 55 పరుగులు సాధించింది. బంగ్లా స్పిన్నర్లు మెహదీ హసన్‌ మిరాజ్‌ (3/17), తైజుల్‌ ఇస్లాం (2/29) అయిదు వికెట్లు తీశారు. మిచెల్‌ (12 బ్యాటింగ్‌), ఫిలిప్స్‌ (5 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.

ముష్ఫికర్‌ అనూహ్యంగా ఔట్‌: తొలి టెస్టులో బంగ్లా బ్యాటర్‌ ముష్ఫికర్‌ రహీం అనూహ్య రీతిలో ఔటయ్యాడు. ఫీల్డింగ్‌కు విఘాతం కలిగించిన కారణంగా అంపైర్‌ అతడిని ఔట్‌గా ప్రకటించాడు.  ఇన్నింగ్స్‌ 41వ ఓవర్లో పేసర్‌ కైల్‌ జేమీసన్‌ సంధించిన బంతిని ముష్ఫికర్‌ డిఫెన్స్‌ ఆడాడు. ఆఫ్‌ సైడ్‌ దిశగా వెళ్తున్న బంతిని ముష్ఫికర్‌ చేతితో ముందుకు తోశాడు. కివీస్‌ ఫీల్డర్లు అప్పీల్‌ చేయడంతో మూడో అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు. బ్యాటర్‌ ఉద్దేశపూర్వకంగా బంతిని చేతితో అడ్డుకోవడం నిబంధనలకు విరుద్ధం. ముష్ఫికర్‌ బంతిని ఆడిన తర్వాత చేతితో ఆపడంతో నిబంధనల ప్రకారం ఔటయ్యాడు. గతంలో ‘హ్యాండిల్డ్‌ ద బాల్‌’గా ఉన్న ఈ నిబంధనను ‘ఫీల్డింగ్‌కు విఘాతం’గా మార్చారు. బంగ్లా క్రికెట్‌ చరిత్రలో ఈ విధంగా ఔటైన మొదటి బ్యాటర్‌గా ముష్ఫికర్‌ నిలిచాడు. టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఈ విధంగా ఔటైన 11వ బ్యాటర్‌ ముష్ఫికర్‌. గత 22 ఏళ్లలో అతడే తొలి బ్యాటర్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు