Maxwell: నడవలేని స్థితి వరకు ఐపీఎల్‌ ఆడతా

జీవితంలో నడవలేని స్థితికి చేరుకునే వరకు ఐపీఎల్‌లో ఆడతానని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ అన్నాడు. ఆసీస్‌ ప్రపంచకప్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన 35 ఏళ్ల మ్యాక్స్‌వెల్‌ ఐపీఎల్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.

Updated : 07 Dec 2023 09:35 IST

మెల్‌బోర్న్‌: జీవితంలో నడవలేని స్థితికి చేరుకునే వరకు ఐపీఎల్‌లో ఆడతానని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ అన్నాడు. ఆసీస్‌ ప్రపంచకప్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన 35 ఏళ్ల మ్యాక్స్‌వెల్‌ ఐపీఎల్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ‘‘బహుశా నా కెరీర్‌లో ఆడే చివరి టోర్నీ ఐపీఎల్‌ కావొచ్చు. నడవలేని స్థితికి చేరుకునే వరకు ఐపీఎల్‌లో ఆడతా. డివిలియర్స్‌, విరాట్‌ కోహ్లీతో కలిసి భుజాలు కలపడం.. వారితో మాట్లాడుతూ మిగతా వాళ్ల ఆట చూడటం ఏ ఆటగాడైనా కోరుకునే గొప్ప అనుభూతి. టీ20 ప్రపంచకప్‌కు ముందు వీలైనంత ఎక్కువ మంది ఆసీస్‌ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడతారని భావిస్తున్నా’’ అని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాడు మ్యాక్స్‌వెల్‌ వివరించాడు. వచ్చే ఏడాది జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌కు వెస్టిండీస్‌- అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని