IND vs SA: దక్షిణాఫ్రికాకు టీమ్‌ఇండియా

సొంతగడ్డపై టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియాను చిత్తుచేసిన భారత జట్టు మరో సవాల్‌కు సిద్ధమైంది. బుధవారం దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరింది. ఈ పర్యటనలో భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు మూడేసి టీ20లు, వన్డేలు.. రెండు టెస్టుల్లో తలపడతాయి.

Updated : 07 Dec 2023 11:45 IST

దిల్లీ: సొంతగడ్డపై టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియాను చిత్తుచేసిన భారత జట్టు మరో సవాల్‌కు సిద్ధమైంది. బుధవారం దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరింది. ఈ పర్యటనలో భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు మూడేసి టీ20లు, వన్డేలు.. రెండు టెస్టుల్లో తలపడతాయి. ఈనెల 10, 12, 14 తేదీల్లో టీ20లు.. 17, 19, 21న వన్డేలు జరుగుతాయి. 26న తొలి టెస్టు, జనవరి 3న రెండో టెస్టు ప్రారంభమవుతాయి.


అందుకే చాహర్‌ ఆడలేదు

దిల్లీ: తండ్రి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో ఆస్ట్రేలియాతో అయిదో టీ20 మ్యాచ్‌లో ఆడలేదని భారత పేసర్‌ దీపక్‌ చాహర్‌ తెలిపాడు. ఆసీస్‌తో నాలుగో మ్యాచ్‌లో ఆడిన చాహర్‌.. అయిదో టీ20 నుంచి చివరి నిమిషంలో వైదొలిగాడు. ‘వైద్య అత్యయిక స్థితి’ కారణంగా చాహర్‌ ఆడలేదని కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మ్యాచ్‌ అనంతరం వివరణ ఇచ్చాడు. బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైన దీపక్‌ తండ్రి లోకేంద్ర సింగ్‌కు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ‘‘సకాలంలో నాన్నను ఆసుపత్రికి తీసుకొచ్చాం. ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగ్గా ఉంది. నాకు మా నాన్న చాలా ముఖ్యం. నన్నిలా ఆటగాడిని చేసింది ఆయనే. ఈ స్థితిలో ఆయనను విడిచి ఎక్కడికీ వెళ్లను. ప్రమాదం నుంచి ఆయన బయటపడిన తర్వాత దక్షిణాఫ్రికాకు పయనమవుతా. రాహుల్‌ ద్రవిడ్‌, సెలెక్టర్లతో మాట్లాడా’’ అని చాహర్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని