David Warner: వార్నర్‌ను బ్లాక్‌ చేసిన సన్‌రైజర్స్‌

Eenadu icon
By Sports News Desk Updated : 20 Dec 2023 07:48 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

సిడ్నీ: ఐపీఎల్‌లో 2016 సీజన్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను విజేతగా నిలబెట్టాడు డేవిడ్‌ వార్నర్‌ (David Warner). ఆ జట్టు తరఫున విజయవంతమైన కెప్టెన్‌గానూ, బ్యాటర్‌గానూ సత్తా చాటాడు. అలాంటి సారథిని వదులుకున్న సన్‌రైజర్స్‌ (Sunrisers Hyderabad).. అతడిని సామాజిక మాధ్యమాల్లోనూ బ్లాక్‌ చేసిందట. ఈ విషయాన్ని స్వయంగా వార్నరే వెల్లడించాడు. తాజాగా వేలంలో ఆస్ట్రేలియా సహచరుడు ట్రావిస్‌ హెడ్‌ను సన్‌రైజర్స్‌ రూ.6.80 కోట్లకు దక్కించుకున్న నేపథ్యంలో అతడికి సన్‌రైజర్స్‌ అకౌంట్లో అభినందనలు చెప్పాలని ప్రయత్నించి వార్నర్‌ విఫలమయ్యాడు. దీనికి కారణం ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌ వేదికల్లో వార్నర్‌ను సన్‌రైజర్స్‌ బ్లాక్‌ చేయడమే. తన అకౌంట్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ బ్లాక్‌ చేసిన స్క్రీన్‌ షాట్లను వార్నర్‌ సామాజిక మాధ్యమంలో పంచుకున్నాడు. 2015లో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా నియమితుడైన వార్నర్‌.. తర్వాతి ఏడాదిలోనే ఆ జట్టుకు టైటిల్‌ అందించాడు. బ్యాటర్‌గా 848 పరుగులు చేసి టోర్నీలో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 2021లో సీజన్‌ మధ్యలో వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించిన సన్‌రైజర్స్‌.. 2022 వేలంలో వదిలిపెట్టింది. అతడిని దిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకుంది.

Tags :
Published : 20 Dec 2023 04:11 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు