David Warner: టోపీలు దొరికాయి.. భారం తొలగింది

సిడ్నీ: వార్నర్ టోపీలు దొరికాయి. రెండు బ్యాగీ గ్రీన్ టోపీలున్న ఓ బ్యాగు ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టు ఉంటున్న హోటల్లోనే కనిపించింది. దీన్ని తీసుకున్న వార్నర్.. తన టోపీలు దొరికిన ఆనందాన్ని శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ‘‘నా బ్యాగీ గ్రీన్ టోపీలు దొరికాయని మీకు చెప్పేందుకు చాలా సంతోషంగా, అలాగే ఉపశమనంగానూ ఉంది. ఆ టోపీ ఎంత ప్రత్యేకమో ప్రతి క్రికెటర్‌కూ తెలుసు. ఈ సందర్భాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటా. ఇవి నా వరకూ చేరడానికి సాయపడ్డ అందరికీ రుణపడి ఉంటా. గత రెండు రోజులుగా భుజాలపై ఉన్న భారం తొలగినట్లు అనిపిస్తోంది. రవాణా సంస్థ క్వాంటస్‌కు, హోటల్‌కు, టీమ్ మేనేజ్‌మెంట్‌కు ధన్యవాదాలు’’ అని పోస్టు చేసిన వీడియోలో వార్నర్ తెలిపాడు. వార్నర్ కెరీర్‌లో చివరి టెస్టు ఆడుతున్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


